News August 3, 2024
టెలికం సర్వీస్ ఔటేజ్: కస్టమర్లకు పరిహారం ఇవ్వాల్సిందే

టెలికం, బ్రాడ్‌బ్యాండ్ నాణ్యతా ప్రమాణాలను ట్రాయ్ సవరించింది. సేవలు నిలిస్తే కస్టమర్లకు పరిహారం ఇవ్వాలని టెలికం ఆపరేటర్లను ఆదేశించింది. ఏ ఒక్క క్వాలిటీ ప్రమాణం అందుకోకున్నా వేసే ఫైన్‌ను ₹50K-₹1Lకు పెంచింది.
* 2G/3G/4G/5G మొబైల్ కవరేజీ మ్యాపుల్ని వెబ్సైట్లో చూపాలి
* నెట్వర్క్ ఆగితే ప్రీపెయిడ్, పోస్టుపెయిడ్ను బట్టి వ్యాలిడిటీ, రిబేట్ ఇవ్వాలి
* ఏడాదిలో 12Hrs ఔటేజ్ను ఒక రోజుగా పరిగణిస్తారు.
Similar News
News November 15, 2025
యాపిల్‌కు త్వరలో కొత్త CEO.. టిమ్ కుక్ వారసుడు ఎవరు?

2011లో స్టీవ్ జాబ్స్ నుంచి టిమ్ కుక్ యాపిల్ CEOగా బాధ్యతలు అందుకున్నారు. కంపెనీని 4 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లిన కుక్.. 2026 ప్రారంభంలో తన వారసుడిని ప్రకటిస్తారనే ప్రచారం సాగుతోంది. 2001లో హార్డ్‌వేర్ ఆర్కిటెక్ట్‌గా ప్రొడక్ట్ డిజైన్ టీమ్‌లో చేరిన జాన్ టెర్నస్ తదుపరి సీఈవోగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని టాక్. ఈ మేరకు సన్నాహాలు జరుగుతున్నట్టు ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్టులో పేర్కొంది.
News November 15, 2025
తెలంగాణలో 26 అధునాతన గోదాముల ఏర్పాటు

TG: రాష్ట్రంలో పంట నిల్వకు గోదాముల కొరత లేకుండా చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.295 కోట్లతో 2.91 లక్షల టన్నుల సామర్థ్యంతో 26 అధునాతన గోదాములు నిర్మించాలని నిర్ణయించింది. నిల్వ చేసిన పంటకు ఎలుకలు, చీడపీడల బెడద లేకుండా, గాలి, వెలుతురు అవసరం మేరకు ఉండేట్లు వీటిని నిర్మించనున్నారు. సీసీ కెమెరాలు, సెన్సార్లు ఏర్పాటు చేయడంతో పాటు AI వినియోగించి తూకం, నిల్వ విధానాన్ని సులభతరం చేయనున్నారు.
News November 15, 2025
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. సత్య నాదెళ్లకు ఆహ్వానం?

డిసెంబర్ 8, 9న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్లను ఆహ్వానించాలని ప్రయత్నిస్తోంది. వచ్చేనెల నాదెళ్ల INDలో పర్యటించనున్నట్లు సమాచారం. దీంతో ఆయన టూర్ షెడ్యూల్‌పై అధికారులు ఆరా తీస్తున్నారు. మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలోనే నాదెళ్ల రాకపై క్లారిటీ రానుంది.


