News August 25, 2024
టెలిగ్రామ్ ఫౌండర్ అరెస్ట్!

పాపులర్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ఫౌండర్ పర్వేల్ దురోవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాదం, మాదకద్రవ్యాల సరఫరా, మోసాలు, మనీలాండరింగ్ వంటి వాటికి సహకరిస్తున్నారనే ఆరోపణలతో ఆయనను ఫ్రాన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. దీనిపై టెలిగ్రామ్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
Similar News
News December 4, 2025
పెద్దపల్లి: పోస్ట్ బాక్సులు.. గుర్తున్నాయా..?

ఒకప్పుడు లేఖలతో పోస్ట్ బాక్సులు కళకళలాడేవి. ఆత్మీయుల శుభాకాంక్షలు, మనసులోని మాటలతో పలకరించేవి. అలాంటి మధుర జ్ఞాపకాలకు నెలవైన పోస్ట్ డబ్బాలు నేడు కనుమరుగయ్యాయి. ఫోన్లు, సోషల్ మీడియా రాకతో ఆ తపాలా పెట్టెలు ఆదరణ కోల్పోతున్నాయి. నేడు కేవలం ఖాళీ పెట్టెలు అక్కడక్కడా దర్శనమిస్తున్నాయి. PDPL(D) ధర్మారంలో తీసిన చిత్రమిది. ఇక అప్పటి మధుర జ్ఞాపకాలను మోసిన పోస్ట్ బాక్సులతో మీకున్న అనుబంధాన్ని COMMENT చేయండి.
News December 4, 2025
తన కన్నా అందంగా ఉండొద్దని.. మేనత్త దారుణం!

కుటుంబంలో తన కన్నా అందంగా ఎవ్వరూ ఉండొద్దని దారుణాలకు పాల్పడిందో మహిళ. ముగ్గురు కోడళ్లు, కొడుకును నీళ్లలో ముంచి హత్య చేసింది. పానిపట్(హరియాణా)లో పెళ్లివేడుకలో విధి(6) టబ్లో పడి చనిపోయింది. పోలీసుల దర్యాప్తులో మేనత్త పూనమ్ హత్య చేసిందని తేలింది. మరో 3హత్యలూ చేసినట్లు పూనమ్ ఒప్పుకుంది. 2023లో ఇషిక(9)ను చంపిన ఆమె తనపై అనుమానం రాకుండా కొడుకు శుభం(3)ను చంపేసింది. ఆగస్టులో జియా(6)ను పొట్టనపెట్టుకుంది.
News December 4, 2025
ఫిబ్రవరిలో పెళ్లి అని ప్రచారం.. స్పందించిన రష్మిక

నటి రష్మిక మందన్న-విజయ్ దేవరకొండ పెళ్లి వార్తలు కొంతకాలంగా వైరల్ అవుతూనే ఉన్నాయి. 2026 ఫిబ్రవరిలో రాజస్థాన్లో పెళ్లి జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ‘వివాహాన్ని నేను ధ్రువీకరించను. అలాగని ఖండించను. సమయం వచ్చినప్పుడు మాట్లాడతా. అంతకుమించి ఏమీ చెప్పను’ అని ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు.


