News April 1, 2024
ఫేక్ న్యూస్‌కు చెప్పండి చెక్

యూజర్లకు ముఖ్య గమనిక. మన Way2News లోగోతో కొందరు సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. మా లోగోతో వచ్చే ఫార్వర్డ్స్ వెరిఫై చేశాక మాత్రమే ఇతరులకు షేర్ చేయండి. మా ప్రతి ఆర్టికల్‌కు యునిక్ కోడ్ ఉంటుంది. మీరు పొందిన స్క్రీన్‌షాట్‌పై కోడ్‌ను fc.way2news.comలో ఎంటర్ చేయండి. సెర్చ్‌లో మరో వార్త వచ్చినా, ఏది రాకపోయినా మీరు పొందినది ఫేక్ వార్త. వీటిని grievance@way2news.comకు మెయిల్ చేయండి.
Similar News
News January 28, 2026
హిమపాతం.. ధర్మశాల స్టేడియం ఇలా మారింది!

మంచు కురవడంతో హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల క్రికెట్ స్టేడియం వెండి కొండలా మెరిసిపోతోంది. చుట్టూ ఉన్న ధౌలాధర్ పర్వత శ్రేణులతో పాటు పరిసర ప్రాంతాలనూ మంచు దుప్పటి కప్పేసింది. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉన్న ఈ స్టేడియం ప్రపంచంలోనే సుందరమైన మైదానాల్లో ఒకటిగా పేరుగాంచింది. SMలో వైరలవుతున్న అందమైన ఈ ఫొటోలను చూసి ప్రకృతి ప్రేమికులు ఫిదా అవుతున్నారు.
News January 28, 2026
ICET షెడ్యూల్ విడుదల

TG: MBA, MCA కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ICET-2026 షెడ్యూల్ విడుదలైంది.
*ఫిబ్రవరి 6న నోటిఫికేషన్
*ఫిబ్రవరి 12 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు
*మార్చి 16- దరఖాస్తులకు చివరి తేదీ
*మే 13, 14న కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్
**అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.550, ఇతర అన్ని విభాగాల వారికి రూ.750. డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులూ అప్లై చేసుకోవచ్చు.
News January 28, 2026
నేను పార్టీ మారినట్లు BRS భావిస్తోంది: దానం

TG: తాను BRSకు రాజీనామా చేయలేదని, అలాగే తనను ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు సమాచారం లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పారు. ‘2024 మార్చిలో కాంగ్రెస్ సమావేశానికి వెళ్లా. వ్యక్తిగత హోదాలోనే ఆ మీటింగ్‌కు హాజరయ్యా. నేను పార్టీ మారినట్లు BRS భావిస్తోంది’ అని తెలిపారు. మరోవైపు తనపై వేసిన అనర్హత పిటిషన్‌పై ఆయన అఫిడవిట్ దాఖలు చేశారు. పిటిషన్‌ను కొట్టివేయాలని స్పీకర్‌ను ఆయన కోరారు.


