News October 24, 2025
‘అమ్మపై ఒట్టేసి చెప్పు’.. ధనశ్రీపై చాహల్ సెటైర్లు

మాజీ భార్య ధనశ్రీకి భారత క్రికెటర్ చాహల్ రూ.4.75 కోట్ల భరణం చెల్లించడం తెలిసిందే. దీనిపై చాహల్ తాజా పోస్ట్ వైరలవుతోంది. ఆర్థికంగా ఇండిపెండెంట్‌గా ఉన్న భార్య భరణం అడగొద్దని ఢిల్లీ హైకోర్టు పేర్కొందని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ‘ఈ నిర్ణయంపై వెనక్కి వెళ్లనని అమ్మపై ఒట్టేసి చెప్పు’ అని స్మైలీ ఎమోజీలతో క్యాప్షన్ పెట్టారు. విడాకుల అనంతరం వీరిద్దరూ పరస్పరం విమర్శలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.
Similar News
News October 25, 2025
INDలో జూనియర్ హాకీ WC.. తప్పుకున్న PAK

భారత్ వేదికగా NOV 28 నుంచి జరగనున్న పురుషుల జూనియర్ హాకీ WC నుంచి PAK తప్పుకుంది. దీన్ని అంతర్జాతీయ హాకీ సమాఖ్య ధృవీకరించింది. భారతదేశంతో ఉద్రిక్తతల కారణంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. కాగా పాక్ వైదొలగడం గురించి తమకు తెలియదని, FIH ప్రకటన కోసం ఎదురు చూస్తున్నామని హాకీ ఇండియా తెలిపింది. AUGలో పురుషుల ఆసియా కప్ నుంచి సైతం PAK తప్పుకోగా బంగ్లాదేశ్‌తో ఆ స్థానాన్ని భర్తీ చేసి టోర్నీని కొనసాగించారు.
News October 25, 2025
అన్ని కార్తెలు తప్పినా హస్త తప్పదు

కార్తెల(నక్షత్రాలు) ప్రకారం రైతులు వర్షాన్ని అంచనా వేసేవారు. వర్షం కురిసే సీజన్‌కు సంబంధించిన అన్ని కార్తెలు తప్పిపోయినా, హస్త సమయంలో వర్షం తప్పకుండా పడుతుంది అనే నమ్మకాన్ని ఇది సూచిస్తుంది. సీజన్‌లో కురవాల్సిన వాన మిగతా కార్తెల్లో పడకపోయినా హస్తలో కచ్చితంగా పడుతుందని ఓ నమ్మకం. అందుకే రైతులు ఆ సందర్భంలో ఈ సామెతను వాడుతుంటారు.
(మీకు తెలిసిన వ్యవసాయ సామెతలను కామెంట్ చేయండి)
News October 25, 2025
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్.. ఖర్గేతో భేటీ!

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ చీఫ్ ఖర్గేతో ఆయన భేటీ కానున్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకాలపై అధిష్ఠానం సీఎం అభిప్రాయాలను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు తాజా రాజకీయ పరిస్థితులు, మంత్రుల మధ్య విభేదాలు, అంతర్గత అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ నెలాఖరు కల్లా డీసీసీ అధ్యక్షులను నియమించే అవకాశముంది.


