News July 22, 2024
‘మీ భర్త ఎవరో చెప్పండి’: శాంతికి నోటీసులు

AP: దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ <<13630730>>శాంతి<<>>, YCP MP విజయసాయి రెడ్డిపై చేసిన <<13638248>>ఆరోపణలు<<>> చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తాజాగా ‘మీ భర్త ఎవరో వివరణ ఇవ్వండి’ అంటూ శాంతికి దేవదాయ శాఖ నోటీసులు ఇచ్చింది. ‘ఉద్యోగంలో చేరినప్పుడు భర్త పేరు మదన్మోహన్ అని పేర్కొన్నారు. ఇటీవల ప్రెస్మీట్లో సుభాష్ని పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. ఇది ఉద్యోగి ప్రవర్తనా నియమావళికి విరుద్ధం’ అని నోటీసుల్లో పేర్కొంది.
Similar News
News November 26, 2025
రాజ్యాంగ రూపకల్పనలో అతివలు

భారత రాజ్యాంగాన్ని లిఖితపూర్వకంగా, క్రమ పద్ధతిలో ఒక గ్రంథంగా రూపొందించారు. దీన్ని భారత రాజ్యాంగ పరిషత్ 1946, డిసెంబరు 9 నుంచి 1949, నవంబరు 26 వరకు అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలంలో రూపొందించింది. దీంట్లో గౌరీ భంజా చోళ కాంస్య నటరాజ విగ్రహ రూపాన్ని రాజ్యాంగంలో చిత్రీకరించారు. అలాగే జమునా సేన్, నిబేదిత బోస్, అమలా సర్కార్, బాని పటేల్ కూడా రాజ్యాంగంలోని పలు ఇల్యుస్ట్రేషన్లు చిత్రీకరించారు.
News November 26, 2025
ఇతిహాసాలు క్విజ్ – 78 సమాధానాలు

ప్రశ్న: సుబ్రహ్మణ్య స్వామికి ‘షణ్ముఖ’ అనే పేరు ఎలా వచ్చింది?
సమాధానం: సుబ్రహ్మణ్య స్వామికి 6 ముఖాలు (షణ్ముఖాలు) ఉన్నాయి కాబట్టి ఆ పేరు వచ్చింది. శివుని తేజస్సు నుంచి ఉద్భవించిన ఆయన బాల రూపం ఆరు భాగాలుగా విడిపోయింది. ఆ ఒక్కో భాగం ఒక్కో ముఖంతో 6 సరస్సులలో తేలింది. ఈ అన్ని రూపాలను కార్తీక దేవతలే పెంచాయి. అలా కార్తీకేయుడయ్యాడు. పార్వతీ వాటన్నింటినీ కలిపి ఒకే రూపంగా మార్చింది. <<-se>>#Ithihasaluquiz<<>>
News November 26, 2025
సుదీర్ఘ సూర్య గ్రహణం రాబోతుంది

2027 Aug 2న 21వ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘ సూర్య గ్రహణం ఏర్పడనుంది. గ్రహణం కనిపించే ప్రాంతాలు 6 నిమిషాల 23 సెకన్ల పాటు అంధకారంలో ఉండనున్నాయి. అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రారంభమయ్యే ఈ గ్రహణం స్పెయిన్, మొరాకో, అల్జీరియా, ఈజిప్ట్, మిడిల్ ఈస్ట్తో పాటు దక్షిణ అమెరికా ప్రాంతాల్లో కనిపించనుంది. ఇంత ఎక్కువ వ్యవధి కలిగిన గ్రహణం అరుదుగా రావడం వల్ల ఖగోళ శాస్త్రవేత్తలు దీన్ని పరిశోధనావకాశంగా చూస్తున్నారు.


