News June 30, 2024
సూర్య క్యాచ్ గురించి మా పిల్లలకు చెబుతా: రవి

T20WC ఫైనల్‌లో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో సూర్య కుమార్ యాదవ్ పట్టిన క్యాచ్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. టీమ్ ఇండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్ సైతం సూర్య క్యాచ్‌కు ఫిదా అయిపోయారు. ‘మా నాన్న నాకు కపిల్ దేవ్ పట్టిన క్యాచ్ గురించి చెప్పారు. నేను నా పిల్లలకు సూర్య పట్టిన క్యాచ్ గురించి చెబుతా’ అని ఇన్‌స్టాలో పోస్టు చేశారు. దానికి సూర్య ‘చాలా పెద్ద మాట అన్నారు’ అని రెస్పాండ్ అయ్యారు.
Similar News
News October 22, 2025
శ్రీలంక నేతను కాల్చి చంపేశారు

శ్రీలంక దేశం వెలిగామా కౌన్సిల్ ఛైర్మన్, ప్రతిపక్ష సమాగి జన బలవేగయ పార్టీ నేత లసంత విక్రమశేఖర(38) దారుణ హత్యకు గురయ్యారు. తన ఆఫీసులో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న సమయంలో ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి పరారయ్యారు. విక్రమశేఖరను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
News October 22, 2025
రేపు జగన్ మీడియా సమావేశం

AP: YCP చీఫ్ వైఎస్ జగన్ గురువారం ఉదయం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారని పార్టీ ప్రకటన విడుదల చేసింది. సమకాలీన రాజకీయాంశాలపై ఆయన మాట్లాడనున్నారు. పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ గురించి వివరిస్తారని తెలుస్తోంది. అలాగే నకిలీ మద్యం, రాజయ్యపేట బల్క్ డ్రగ్ పార్కు, కాకినాడ సెజ్ భూములు తదితరాలపై వివరాలు వెల్లడిస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
News October 22, 2025
బంగ్లా నేవీ అధీనంలో 8మంది AP మత్స్యకారులు

పొరపాటున తమ జలాల్లోకి ప్రవేశించిన విజయనగరానికి చెందిన 8మంది మత్స్యకారులను బంగ్లా నేవీ అదుపులోకి తీసుకుంది. భోగాపురం మం. కొండ్రాజుపాలెంకి చెందిన మరుపుల్లి చిన్న అప్పన్న, రమేశ్, అప్పలకొండ, ప్రవీణ్, చిన్నఅప్పన్న, రాము, పూసపాటిరేగ మం. తిప్పలవలసకి చెందిన రమణ, రాము విశాఖలోని పోర్ట్ ఏరియాలో ఉంటున్నారు. ఈనెల 13న వేటకు వెళ్లగా.. దారి తప్పి 14న అర్ధరాత్రి 2 గం.కు బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించారు.