News November 6, 2024
నాకు కాదు DCMకు చెప్పు: అంబటి

AP: హోం మంత్రి అనిత ఎవరో చెప్పాల్సింది తనకు కాదని, DCMకు చెప్పాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. అనిత ఇచ్చుకున్న సెల్ఫ్ సర్టిఫికెట్‌కు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, చాలా సంతోషంగా ఉందని ఎద్దేవా చేశారు. ‘H.Mగా బాధ్యత వహించండి. నేను బాధ్యత తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి’ అన్న వ్యక్తికి <<14546885>>ఈ విషయాన్ని<<>> చెప్పాలని సూచించారు.
Similar News
News November 26, 2025
కొత్త జిల్లాలో పరిపాలనకు అంతా సిద్ధమేనా..?

మార్కాపురం సరికొత్త జిల్లాగా అవతరించనున్న నేపథ్యంలో జిల్లా పరిపాలనకు సంబంధించిన కార్యాలయాలపై విస్తృత చర్చ సాగుతోంది. జిల్లా అంటే కలెక్టర్, ఎస్పీ కార్యాలయంతోపాటు ఇతర శాఖల అధికారులకు అనువైన భవనాలు అవసరం. అయితే జిల్లా ఆమోదానికి ముందుగానే ప్రభుత్వం, నివేదికలను తెప్పించుకొని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుత ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు సారథ్యంలోనే కొత్త జిల్లా కార్యాలయాల ఎంపిక సాగనుందట.
News November 26, 2025
నవంబర్ 26: చరిత్రలో ఈ రోజు

1921: వ్యాపారవేత్త, శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ జననం
1949: భారత రాజ్యాంగం ఆమోదం పొందింది
1997: సినీ నటుడు మందాడి ప్రభాకర రెడ్డి మరణం
2006: సినీ నటి జి.వరలక్ష్మి మరణం
2008: ముంబై ఉగ్ర దాడిలో 160 మందికిపైగా మృతి (ఫొటోలో)
* జాతీయ న్యాయ దినోత్సవం
* జాతీయ పాల దినోత్సవం
News November 26, 2025
అరుణాచల్ మాదే.. నిజాన్ని మార్చలేరు: భారత్

అరుణాచల్ తమ భూభాగమేనన్న చైనా <<18386250>>ప్రకటనను<<>> భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఖండించారు. ‘భారత్‌లో అరుణాచల్ అంతర్భాగం. ఇదే వాస్తవం. చైనా తిరస్కరించినా నిజం మారదు’ అని స్పష్టం చేశారు. షాంఘై ఎయిర్‌పోర్టులో భారత ప్రయాణికురాలిని అడ్డుకోవడాన్ని తప్పుబట్టారు. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రావెల్ రూల్స్, అన్ని దేశాల పౌరులకు 24hrs వీసా ఫ్రీ ట్రాన్సిట్ కల్పించే చైనా రూల్‌నూ అక్కడి అధికారులు పాటించలేదన్నారు.


