News June 29, 2024
వారిని ఇంట్లోనే తాగమని చెప్పండి: మంత్రి

పురుషులతో మద్యం అలవాటు మాన్పించడానికి మధ్యప్రదేశ్ మంత్రి నారాయణ సింగ్ మహిళలకు చెప్పిన సూచన చర్చనీయాంశంగా మారింది. ‘మీ ఇంట్లోని పురుషులకు బయట మద్యం తాగొద్దని చెప్పండి. ఇంటికే తెచ్చుకొని తాగమనండి. అప్పుడు వారు మహిళలు, పిల్లల ముందు తాగడానికి సిగ్గుపడతారు. క్రమంగా అలవాటు మానుకుంటారు’ అని ఓ సభలో మహిళలకు సూచించారు. మంత్రి వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ ‘ఇది గృహ హింసకు దారితీస్తుంది’ అని మండిపడింది.
Similar News
News October 17, 2025
మహిళల కోసం ఇన్ఫోసిస్ కొత్త ప్రోగ్రామ్

కనీసం 6 నెలల కెరీర్ గ్యాప్ వచ్చిన మహిళా నిపుణులకు ఉద్యోగాలిచ్చేందుకు ఇన్ఫోసిన్ ముందుకొచ్చింది. ‘రీస్టార్ట్ విత్ ఇన్ఫోసిస్ ఇనిషేటివ్’ పేరుతో గత నెల కొత్త రిఫరల్ ప్రోగ్రామ్ను లాంచ్ చేసింది. తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు అర్హులైన మహిళలను రిఫర్ చేయొచ్చు. వారు జాబ్కు ఎంపికైతే లెవెల్-3లో రూ.10వేలు, లెవెల్-4లో రూ.25వేలు, లెవెల్-5లో రూ.35వేలు, లెవెల్ 6లో రూ.50వేల వరకు రివార్డులు అందించనుంది.
News October 17, 2025
646 పోస్టులు.. దరఖాస్తుకు 3రోజులే సమయం

సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడాక్)లో 646 పోస్టులకు అప్లై చేయడానికి ఇంకా 3రోజులే (OCT 20) సమయం ఉంది. బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, పీహెచ్డీతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.cdac.in
News October 17, 2025
షోడశోపచార పూజతో శివపథం

పరమశివుని అనుగ్రహం పొందడానికి శివ లింగానికి షోడశోపచార పూజ చేయడం అత్యుత్తమని శివ మహాపురాణం చెబుతోంది. ఆవాహనం నుంచి ఉద్వాసన వరకు 16 భక్తియుక్త సేవలతో స్వామిని ఆరాధించాలి. ఈ ప్రక్రియ సాధ్యం కాకపోతే.. పవిత్రమైన అభిషేకం, ప్రేమపూర్వక నైవేద్యం, భక్తితో నమస్కారాలు చేసినా సరిపోతుంది. ఈ ఆరాధనలు భక్తులను తరింపజేస్తాయి. పరమ శివుని దివ్యలోకమైన ‘శివపథాన్ని’ అందిస్తాయి. ఈ సేవలే ముక్తికి మార్గాలు. <<-se>>#SIVOHAM<<>>