News April 28, 2024

ఆర్చరీలో అదరగొట్టిన తెలుగమ్మాయి

image

ఆర్చరీ ప్రపంచకప్‌లో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన జ్యోతి సురేఖ అదరగొట్టారు. కాంపౌండ్ మహిళల వ్యక్తిగత, టీమ్, మిక్స్‌డ్ విభాగాల్లో స్వర్ణ పతకాలు గెలిచారు. దీంతో దీపిక కుమారి తర్వాత ఒకే ప్రపంచకప్‌లో మూడు బంగారు పతకాలు నెగ్గిన భారత రెండో ఆర్చర్‌గా జ్యోతి నిలిచారు. కాగా వ్యక్తిగత విభాగంలో ఫైనల్ విజయంతో ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్‌కు జ్యోతి అర్హత సాధించారు.

Similar News

News January 25, 2026

షోరూమ్‌లలో వెహికల్ రిజిస్ట్రేషన్ వాటికి మాత్రమే!

image

TG: వాహనదారులు ఆర్టీఏ ఆఫీసులకు వెళ్లకుండా షోరూమ్‌ల వద్దే వెహికల్స్ <<18940796>>రిజిస్ట్రేషన్<<>> జరిగేలా ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సిస్టమ్ నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం ప్రైవేట్ టూ వీలర్లు, కార్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు, గూడ్స్ వాహనాలకు వర్తించదు. ఆ వాహనాలకు పాత పద్ధతిలో ఆర్టీఏ ఆఫీసుల్లోనే రిజిస్ట్రేషన్ చేస్తారు.

News January 25, 2026

ఆలు కుదురూ చేను కుదురూ ఆనందం

image

“ఆలు”అంటే భార్య. “కుదురు” అంటే స్థిరత్వం లేదా సవ్యంగా ఉండటం. భార్యతో కలహాలు లేకుండా కుటుంబ జీవితం సజావుగా, సంతోషంగా, స్థిరంగా ఉన్నప్పుడూ.. చేను కుదురూ అంటే పొలం(ఆదాయ వనరులు) బాగుండి, ఆదాయం స్థిరంగా ఉన్నప్పుడే రైతు జీవితంలో నిజమైన ఆనందం, ప్రశాంతత లభిస్తాయని ఈ సామెత చెబుతుంది.

News January 25, 2026

నేడు ఆదిత్య హృదయం ఎందుకు పఠించాలి?

image

సూర్యారాధన వల్ల అసాధ్యమైన పనులు కూడా సుసాధ్యమవుతాయని నమ్మకం. రామాయణ యుద్ధంలో అలసిన రాముడికి అగస్త్యుడు ‘ఆదిత్య హృదయం’ బోధించారని పురాణాలు చెబుతున్నాయి. దీన్ని పఠిస్తే లభించిన శక్తితోనే రాముడు రావణుడిని సంహరించగలిగాడని నమ్ముతారు. అలాగే మయూరుడు అనే కవి సూర్యుని స్తుతించి కుష్టు వ్యాధి నుంచి విముక్తుడయ్యాడు. పాండవులు అరణ్యవాసంలో సూర్యుని అనుగ్రహంతోనే ‘అక్షయపాత్ర’ను పొంది అతిథి సత్కారాలు చేయగలిగారు.