News December 28, 2024

ఆస్ట్రేలియన్లకు తెలుగోడి దెబ్బలు!

image

ఆస్ట్రేలియన్లకు తెలుగోళ్లు కొరకరాని కొయ్యలుగా మారారు. కంగారూలపై అప్పట్లో జైసింహా, అజహరుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్.. ఇప్పుడు నితీశ్ కుమార్ రెడ్డి తమ సత్తా చూపించారు. ముఖ్యంగా మన లక్ష్మణుడు కంగారూల విజయాలకు లక్ష్మణరేఖలు గీస్తే.. తాజాగా నితీశ్ హీరో అయ్యారు. ఈ సీజన్ BGTలో భారత్ తరఫున అత్యధిక రన్స్ చేసింది ఈ తెలుగు కుర్రాడే.

Similar News

News December 29, 2024

AUSvsIND: భారత్ ఆలౌట్

image

మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టులో భారత్ 369 పరుగులకు ఆలౌట్ అయింది. నిన్న రాత్రి సెంచరీతో నాటౌట్‌గా ఉన్న నితీశ్, వేగంగా పరుగులు చేసే క్రమంలో లయన్ బౌలింగ్‌లో 114 పరుగులకు ఔటయ్యారు. ఆస్ట్రేలియాకు 105 పరుగుల ఆధిక్యం లభించింది. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్, లయన్‌కు తలో 3 వికెట్లు దక్కాయి.

News December 29, 2024

వచ్చే నెల 20న దావోస్‌కు సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ వచ్చే నెల 20న దావోస్‌కు వెళ్లనున్నారు. అక్కడ జరిగే ప్రపంచ వార్షిక ఆర్థిక సదస్సులో ఆయన, ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి పాల్గొంటారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడుల్ని తీసుకురావడమే ఈ పర్యటన లక్ష్యమని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు సదస్సులో ప్రత్యేకంగా ‘తెలంగాణ పెవిలియన్’ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నాయి.

News December 29, 2024

పేర్ని నానిపై ఎటువంటి కక్ష లేదు: నాదెండ్ల

image

వైసీపీ నేత పేర్ని నానిపై తమకు ఎలాంటి కక్షా లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘కుట్రలు చేయాల్సిన అవసరం మా ప్రభుత్వానికి లేదు. తప్పు చేయకపోతే నాని జరిమానా ఎందుకు కట్టారు? ఆ గోడౌన్‌ను తన భార్య పేరుతో ఎందుకు తీసుకున్నారు? ఎవరి పేరిట ఉంటే వారిపైనే కేసులు నమోదవుతాయి. గిడ్డంగుల తనిఖీల అనంతరం నోటీసులిచ్చినా నాని ఎప్పుడూ స్పందించలేదు. YSRCP ఐదేళ్లపాటు అరాచకపాలన సాగించింది’ అని విమర్శించారు.