News April 14, 2025
CSKలో తెలుగు కుర్రాడి అరంగేట్రం

తెలుగు కుర్రాడు షేక్ రషీద్ ఐపీఎల్లో CSK జట్టు తరఫున ఈరోజు అరంగేట్రం చేస్తున్నాడు. గుంటూరుకు చెందిన ఈ యువ ఓపెనింగ్ బ్యాటర్ 2022లో భారత అండర్-19 జట్టుకు వైస్ కెప్టెన్గా ఉన్నాడు. సెమీస్, ఫైనల్లో రాణించి జట్టుకు కప్ అందించాడు. CSK గత ఏడాదే కొనుగోలు చేసినా అతడికి తుది జట్టులో స్థానం దక్కలేదు. ఈరోజు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రషీద్ రాణించాలని తెలుగు క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.
Similar News
News April 16, 2025
అత్యంత ఎత్తైన బ్రిడ్జిపై వందేభారత్ రైలు.. ప్రారంభించనున్న మోదీ

వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ మధ్యలో ఉన్న చినాబ్ రైల్వే బ్రిడ్జికి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెనగా పేరొంది. దీనిపై ఇక వందేభారత్ రైలు ప్రయాణం సాగించనుంది. న్యూఢిల్లీ నుంచి కశ్మీర్కు సరాసరి నడిచే వందేభారత్ రైలును ఈ నెల 19న మోదీ ప్రారంభించనున్నారు. ప్రస్తుతం కట్రా-శ్రీనగర్ మధ్య రోడ్డు ప్రయాణం 7 గంటలుండగా అది 3గంటలకు తగ్గనుంది. ఇది జమ్మూను కశ్మీర్ను అనుసంధానించే తొలి రైల్వే లైన్ కావడం విశేషం.
News April 16, 2025
శ్రీశైలంలో అమ్మవారికి వైభవంగా కుంభోత్సవం

AP: శ్రీశైల భ్రమరాంబ అమ్మవారి కుంభోత్సవం వైభవంగా జరిగింది. ఏటా ఛైత్ర మాసంలో సాత్విక బలి పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆలయంలో 5వేల గుమ్మడి కాయలు, 5వేల టెంకాయలు, లక్షకు పైగా నిమ్మకాయలతో ఆలయ అధికారులు ఘనంగా వేడుక జరిపారు. ఈ సందర్భంగా భక్తులకు అమ్మవారి నిజరూప దర్శన భాగ్యం కలిగింది. అంతకముందు అన్నం, పెసరపప్పు రాశులుగా పోసి ప్రదోషకాల పూజలు నిర్వహించారు.
News April 16, 2025
ఏప్రిల్ 16: చరిత్రలో ఈరోజు

1848: సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు(ఫొటోలో) జననం
1889: హాస్యనటుడు చార్లీ చాప్లిన్ జననం
1910: సాహితీవేత్త ఎన్ఎస్ కృష్ణమూర్తి జననం
1914: చిత్రకారుడు కేహెచ్ ఆరా జననం
1951: హాస్యనటుడు ఎంఎస్ నారాయణ జననం
1853: భారత్లో తొలి పాసింజర్ రైలును బ్రిటిష్ ప్రభుత్వం ప్రారంభించింది