News August 2, 2024
తెలుగు దర్శకుడు మృతి.. హీరో మనోజ్ ఎమోషనల్ పోస్ట్

మంచు మనోజ్ హీరోగా నటించిన ‘నేను మీకు తెలుసా’ మూవీ దర్శకుడు అజయ్ మృతి చెందారు. హీరో మనోజ్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘నా బెస్ట్ ఫ్రెండ్ అజయ్ ఇక లేరు. ఈ విషయం చెప్పడానికి నాకు మాటలు రావడం లేదు. చాలా త్వరగా వెళ్లిపోయావు అజయ్. నిన్ను చాలా మిస్ అవుతున్నా. ఇది ఒక కల కావాలని కోరుకుంటున్నా. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా బాబాయ్’ అని మనోజ్ Xలో ఎమోషనల్ ట్వీట్ చేశారు.
Similar News
News April 2, 2026
ADB: తొలిరోజు JEE ప్రశాంతం.. ఏడుగురు గైర్హాజరు

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని నలంద కళాశాలలో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్ష తొలి రోజు ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు రెండు సెషన్‌లలో పరీక్ష జరిగింది. కాగా ఉదయం జరిగిన పరీక్షకు 80 మంది విద్యార్థులకు గాను 73 మంది హాజరై ఏడుగురు గైర్హాజరయ్యారని పరీక్షల కో-ఆర్డినేటర్ పున్నారవ్ తెలిపారు. మధ్యాహ్నం కూడా ఏడుగురు గైర్హాజరయ్యారన్నారు.
News April 2, 2026
ఈ దేశాల్లో సగం మంది సింగిల్స్!

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ‘సోలో లైఫే సో బెటర్’ అనుకునే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. వరల్డ్ స్టాటిస్టిక్స్ డేటా-2024 ప్రకారం స్వీడన్(51%), డెన్మార్క్(50%), ఫిన్లాండ్(49%), జర్మనీ(48%), నార్వే(47%) దేశాల్లో దాదాపు సగం మంది ఒంటరిగానే ఉంటున్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ, పెళ్లిని అవసరంలా కాకుండా ఆప్షన్‌లా చూడటం వంటివి ఇందుకు ముఖ్య కారణాలు. ఇక ఇండియాలోనూ 25% మంది ఒంటరిగా ఉంటున్నారట. మరి మీరూ సింగిలేనా?
News April 2, 2026
రాష్ట్రానికి YCP పీడ విరగడవ్వాలి: CBN

AP: అమరావతిపై YCPకి ఇప్పటికీ జ్ఞానోదయం కలగలేదని CM CBN విమర్శించారు. ‘అసెంబ్లీలో తీర్మానం పెడితే రాలేదు. కనీస జ్ఞానముండే వ్యక్తి అయితే రావాలి. పార్లమెంటులో అమరావతిని వ్యతిరేకించిన ఏకైక పార్టీ YCP. ఆ పార్టీ పేరు పలకాలా? ప్రజలంతా ఇక దాన్ని మరిచిపోవాలి. ఈ రాష్ట్రానికి వైసీపీ పీడ విరగడవ్వాలి’ అని అన్నారు. మావిగన్ ఏంటో అర్థం కాలేదని, డిక్షనరీలోనూ లేదని ఎద్దేవా చేశారు.


