News January 3, 2025
తెలుగు డైరెక్టర్ కన్నుమూత

డైరెక్టర్, రచయిత అపర్ణ మల్లాది(54) కన్నుమూశారు. క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె USలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈమె ‘ది అనుశ్రీ ఎక్స్పరిమెంట్’ అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తర్వాత తీసిన ‘పోష్ పోరిస్’ అనే వెబ్ సిరీస్ సూపర్ హిట్టయ్యింది. రెండేళ్ల కిందట ప్రిన్స్, అనీషా, భావన ప్రధాన పాత్రల్లో ‘పెళ్లి కూతురు పార్టీ’ అనే చిత్రాన్ని రూపొందించారు. ఈమె పలు చిత్రాలకు కథలను కూడా అందించారు.
Similar News
News January 15, 2026
ఎన్నికల్లో ఇంకుకు బదులు మార్కర్ పెన్నులు: రాజ్ ఠాక్రే

మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల్లో ఇంకుకు బదులు మార్కర్ పెన్నులు వాడుతున్నారని MNS చీఫ్ రాజ్ ఠాక్రే ఆరోపించారు. ‘ఇది కుట్ర. ఇలాంటి మోసపూరిత ఎన్నికలు ఎందుకు?’ అని ప్రశ్నించారు. సిస్టమ్ను మేనేజ్ చేసి ఎలాగైనా గెలవడానికే ప్రభుత్వం ఇలాంటి వేషాలు వేస్తోందని విమర్శించారు. డబుల్ ఓటింగ్ జరిగే ఛాన్స్ ఉందని ఆరోపించారు. రాజకీయ పార్టీలను అడగకుండా ఇలాంటి మార్పులు చేయడంపై జనం అలర్ట్గా ఉండాలని పిలుపునిచ్చారు.
News January 15, 2026
మీ ఇంటి గోవులను రేపు ఎలా పూజించాలంటే?

కనుమ రోజున ఆవులను, ఎడ్లను చెరువులు, బావుల వద్దకు తీసుకువెళ్లి శుభ్రంగా స్నానం చేయించాలి. ఆపై వాటి కొమ్ములకు రంగులు పూసి, మెడలో గంటలు, పూలమాలలు వేసి అందంగా అలంకరించాలి. నుదుటన పసుపు, కుంకుమలు పెట్టి హారతి ఇవ్వాలి. కొత్త బియ్యంతో వండిన పొంగలిని లేదా పచ్చగడ్డి, బెల్లం కలిపిన పదార్థాలను నైవేద్యంగా తినిపించాలి. చివరగా గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవడం ద్వారా ఆ దేవతల ఆశీస్సులు పొందవచ్చు.
News January 15, 2026
DRDOలో అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్లోని <


