News April 14, 2024
చిరంజీవిని కలిసిన తెలుగు డైరెక్టర్లు.. ఎందుకంటే?
విశ్వంభర సినిమా సెట్‌లో మెగాస్టార్ చిరంజీవిని టాలీవుడ్ డైరెక్టర్లు కలిశారు. మే 4న తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ డే సందర్భంగా HYD ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న ఈవెంట్‌కు రావాల్సిందిగా ఆహ్వానం పలికారు. ఇందుకు ఆయన సమ్మతించారు. చిరంజీవితో సమావేశమైన వారిలో అనుదీప్, మెహర్ రమేశ్, సాయి రాజేశ్, శ్రీరామ్ ఆదిత్య ఉన్నారు. కాగా వశిష్ఠ డైరెక్షన్‌లో విశ్వంభర షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
Similar News
News November 17, 2024
హృతిక్ రోషన్‌పై ఫ్యాన్స్ అసంతృప్తి.. కారణమిదే!
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ టైమ్ వేస్ట్ చేయకుండా వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. కొత్త సినిమాలకు సైన్ చేయాలి లేదా రిటైర్ అవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ‘SIGN MOVIES OR RETIRE HRITHIK’ అని Xలో ట్రెండ్ అవుతోంది. గత ఏడేళ్లలో ఆయన 4 సినిమాలే చేశారు. 2018, 2020, 2021, 2023లో ఆయన మూవీస్ రాలేదు. ప్రస్తుతం NTRతో కలిసి చేస్తున్న ‘WAR-2’ 2025లో రిలీజ్ కానుంది.
News November 17, 2024
సొంత తప్పిదాల వల్ల కూడా ఉద్యోగ మోసాలు: సర్వే
ఉద్యోగాల పేరుతో జరిగే మోసాల్లో 75% ఆశావహుల తప్పిదాల వల్ల కూడా జరుగుతున్నట్టు ఓ సర్వేలో తేలింది. ఫేక్ రిక్రూటర్‌లను గుర్తించడంలో విఫలమై మోసగాళ్లకు నగదు చెల్లిస్తున్నారని, సున్నితమైన సమాచారాన్ని పంచుకుంటున్నారని వెల్లడైంది. వివిధ రంగాల్లోని 1,427 మందిపై జరిపిన సర్వేలో అత్యధికులు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నకిలీ ఉద్యోగ ప్రకటనల్ని తరచూ చూస్తున్నట్లు మరికొందరు పేర్కొన్నారు.
News November 17, 2024
కులం పేరుతో విభజించాలని కాంగ్రెస్ చూస్తోంది: పవన్
దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురాగలిగే సత్తా పీఎం మోదీకి మాత్రమే ఉందని AP Dy.CM పవన్ అన్నారు. మహారాష్ట్రలోని భోకర్‌లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ‘హిందు, ముస్లిం, క్రిస్టియన్ అనే భేద భావం మన దేశంలో లేదు. అమీర్, సల్మాన్, షారుఖ్ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్లుగా ఉన్నారు. అబ్దుల్ కలామ్‌ను గుండెల్లో పెట్టుకున్న దేశం మనది. ప్రజలను కులం, రిజర్వేషన్ల పేరుతో విడగొట్టాలని కాంగ్రెస్ చూస్తోంది’ అని ఆరోపించారు.