News December 26, 2024
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమే బెస్ట్: మోహన్ లాల్
ప్రస్తుతం దేశంలో తెలుగు సినీ పరిశ్రమే అగ్రస్థానంలో ఉందని మలయాళ నటుడు మోహన్ లాల్ అభిప్రాయపడ్డారు. టాలెంట్‌ను టాలీవుడ్ ప్రోత్సహిస్తుంటుందని ఓ ఇంటర్వ్యూలో కొనియాడారు. సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తూ సరిహద్దుల్ని తెలుగు సినిమా చెరిపేస్తోందని ఆయన ప్రశంసించారు. అవకాశం దక్కితే <<14978053>>మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేస్తానంటూ<<>> ఆయన ఇప్పటికే అభిలాషను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News December 26, 2024
సినీ ప్రముఖులతో భేటీలో సీఎం ఆవేదన
TG: సినీ ప్రముఖులతో భేటీలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో మహిళ ప్రాణాలు కోల్పోయిన అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిపారు. ఈ భేటీకి మంత్రులు, హోంశాఖ సెక్రటరీ, డీజీపీ, చిక్కడపల్లి సీఐతో పాటు సినీ పరిశ్రమ నుంచి 46 మంది హాజరయ్యారు.
News December 26, 2024
కేంద్రం అనుమతిస్తే డీజిల్ టూ ఎలక్ట్రిక్ బస్సు?
TG: పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. రెట్రో ఫిట్ మెంట్ పాలసీ ద్వారా మార్చేందుకు కేంద్రాన్ని సాయం కోరింది. కొత్త ఎలక్ట్రిక్ బస్సు రూ.1.50 కోట్ల పైనే ఉండటంతో ఈ వైపు ఆలోచనలు చేస్తోంది. పాత బస్సులను మార్చడం ద్వారా సంస్థపై వ్యయ భారం తగ్గే అవకాశం ఉంది. కేంద్రం దీనికి అనుమతిస్తే తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ బస్సులు రోడ్లపై తిరగనున్నాయి.
News December 26, 2024
బెనిఫిట్ షోలు ఉండవు: సీఎం రేవంత్ రెడ్డి
సినీ ప్రముఖులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. బెనిఫిట్ షోల విషయంలో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోమని స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పినదానికే కట్టుబడి ఉంటామని, బెనిఫిట్ షోలు ఉండవని ఇండస్ట్రీ పెద్దలకు సీఎం తేల్చి చెప్పారు.