News July 25, 2024
మరోసారి తల్లి కాబోతోన్న తెలుగు హీరోయిన్

హీరోయిన్ ప్రణీత సుభాశ్ మరోసారి తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని తెలిపేందుకు ఆమె బేబీ బంప్‌తో ఉన్న తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమెకు బిజినెస్‌మ్యాన్ నితిన్ రాజుతో 2021లో వివాహం కాగా 2022లో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా బేబీ బంప్ ఫొటోలను షేర్ చేస్తూ ‘రౌండ్ 2.. ఇక ఈ ప్యాంట్స్ నాకు ఫిట్ అవ్వవు’ అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో అభిమానులు ప్రణీతకు కంగ్రాట్స్ చెబుతున్నారు.
Similar News
News January 9, 2026
పాకిస్థాన్ క్రికెట్ లీగ్‌లో హైదరాబాద్ టీమ్!

పాక్ క్రికెట్ బోర్డు నిర్వహించే PSLలో 2కొత్త టీమ్స్ చేరాయి. సియాల్కోట్ ఫ్రాంచైజీని OG డెవలపర్స్ ₹58.38 కోట్లకు, హైదరాబాద్ ఫ్రాంచైజీని ₹55.57 కోట్లకు FKS గ్రూప్ దక్కించుకున్నాయి. పాక్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో హైదరాబాద్ పేరుతో సిటీ ఉంది. హైదరాబాద్ ఫ్రాంచైజీ విలువ శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ శాలరీ (₹26.75Cr+27Cr)తో దాదాపు సమానం కావడం గమనార్హం. మొత్తం 8 టీమ్స్‌తో మార్చి 26 నుంచి PSL ప్రారంభం కానుంది.
News January 9, 2026
సంక్రాంతి సినిమాలకు హైక్స్ లేనట్లే

TG: సినిమా టికెట్ల ధరలపై హైకోర్టు ఆగ్రహంతో ప్రభుత్వం వెనక్కి తగ్గే అవకాశముంది. హైక్‌పై పలుమార్లు HC మండిపడటం, ఇకపై పెంచబోమని మంత్రి కోమటిరెడ్డి పలు సందర్భాల్లో చెప్పడం తెలిసిందే. Rajasaabకు హైక్‌పై నేటి విచారణలో ‘మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఇకపై మెమోలు ఇవ్వొద్దు’ అని HC తేల్చిచెప్పింది. దీంతో పండగకు వచ్చే ‘మన శంకర వరప్రసాద్, నారి నారి నడుమ మురారి, భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాలకు పెంపు లేనట్లే.
News January 9, 2026
చంద్రుడిపైకి పారిపోయినా వదలను: మమతా బెనర్జీ

ED రెయిడ్స్ <<18797775>>సమయంలో<<>> తాను ఎలాంటి తప్పు చేయలేదని బెంగాల్ CM మమతా బెనర్జీ అన్నారు. బొగ్గు కుంభకోణం ద్వారా వచ్చే ఆదాయం మొత్తం చివరికి కేంద్ర మంత్రి అమిత్ షాకే వెళ్తుందని ఆరోపించారు. కేంద్ర సంస్థలు ఒత్తిడి చేస్తే తాను అన్నింటినీ బయటపెడతానని హెచ్చరించారు. కేంద్రంలో ఓడిన తర్వాత బీజేపీ నేతలు చంద్రుడిపైకి పారిపోయినా లాక్కొస్తానని కోల్‌కతాలో నిర్వహించిన ర్యాలీలో స్పష్టం చేశారు.


