News December 19, 2024
SBI MDగా తెలుగు వ్యక్తి రామ మోహన్ రావు

బ్యాంకింగ్ దిగ్గజం SBI ఎండీగా తెలుగు వ్యక్తి రామ మోహన్ రావును నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం SBI డిప్యూటీ ఎండీగా ఉన్న ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నట్లు నోటిఫికేషన్ జారీ అయింది. సంస్థ ప్రస్తుత ఛైర్మన్ సీఎస్ శెట్టి కూడా తెలుగు వారే. రామ మోహన్ రావు MDగా బాధ్యతలు స్వీకరిస్తే SBI చరిత్రలో ఒకేసారి 2 కీలక పదవులను తెలుగువారు అధిష్ఠించినట్లు అవుతుంది.
Similar News
News November 5, 2025
TODAY HEADLINES

✦ తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు
✦ KCR, హరీశ్‌ను అరెస్ట్ చేయాలి: CM రేవంత్
✦ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటన.. రైతుల పట్ల ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తోందని వ్యాఖ్య
✦ ఏపీలో అసెంబ్లీకి రాని MLAలపై చర్యలకు పరిశీలన: స్పీకర్
✦ ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. ఆరుగురు మృతి
✦ SBIకి రూ.20,160Cr నికర లాభం
✦ పాక్ ప్లేయర్ రవూఫ్‌పై ICC వేటు.. సూర్యకు మ్యాచ్ ఫీజులో కోత
News November 5, 2025
పార్టీనే నాకు దైవం: కేశినేని చిన్ని

AP: తాను చంద్రబాబుకు వీర భక్తుడినని MP కేశినేని చిన్ని పేర్కొన్నారు. 20 నిమిషాల పాటు క్రమశిక్షణ కమిటీకి వివరణిచ్చి ఆయన వెళ్లిపోయారు. ‘పార్టీయే నాకు దైవం, చంద్రబాబు మాకు సుప్రీం. నాకు తిరువూరులో జరిగిన అవమానం కంటే MLA వల్ల పార్టీకి ఎక్కువ నష్టం జరిగింది. నియోజకవర్గ కార్యకర్తల అభీష్టం మేరకే పార్టీ నిర్ణయం ఉంటుందని అనుకుంటున్నా’ అని వ్యాఖ్యానించారు. ఈ తిరువూరు ఎపిసోడ్‌పై లోకేశ్ నివేదిక కోరారు.
News November 5, 2025
న్యూస్ రౌండప్

* US మాజీ ఉపాధ్యక్షుడు డిక్ చెనీ కన్నుమూత
* రాష్ట్ర పరిధిలో తిరిగే ప్రైవేట్ టూరిస్ట్ బస్సులకు గ్రీన్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని, ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించి, చర్చలకు పిలవాలని AP ప్రైవేట్ బస్సు యజమానుల సంఘం డిమాండ్
* దుబాయ్‌లో మంత్రి నారాయణ పర్యటన.. రాష్ట్రంలో పెట్టుబడులకు అపరెల్ గ్రూపుకు ఆహ్వానం
* జూబ్లీహిల్స్ బైపోల్: హోమ్ ఓటింగ్ వినియోగించుకున్న 97 మంది సీనియర్ సిటిజన్లు, వికలాంగులు


