News April 2, 2024
అస్సాం CSగా తెలుగు వ్యక్తి

APలోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి(M) కోటపాడుకు చెందిన రవి కోత అస్సాం CSగా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన 1993వ బ్యాచ్ అస్సాం-మేఘాలయ కేడర్ IAS అధికారి. అస్సాం CS బాధ్యతలతో పాటు పరిశ్రమలు, వాణిజ్యం, ప్రభుత్వ రంగ సంస్థలు, ఆర్థికశాఖ అదనపు ప్రత్యేక కార్యదర్శి బాధ్యతలనూ నిర్వర్తించనున్నారు. 1966 ఏప్రిల్ 12న జన్మించిన రవి.. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ నుంచి ఆగ్రానమిలో PhD గోల్డ్ మెడల్ అందుకున్నారు.
Similar News
News January 21, 2026
సునీతా విలియమ్స్ గురించి ఈ విషయాలు తెలుసా?

ప్రముఖ వ్యోమగామి సునీతా విలియమ్స్ నాసా నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. భారత సంతతికి చెందిన న్యూరోఅనాటమిస్ట్ దీపక్ పాండ్యా, స్లొవీన్ అమెరికన్ ఉర్సులైన్ బోనీలకు 1965 సెప్టెంబర్ 19న ఒహాయోలో సునీత జన్మించారు. 1998లో నాసాలో చేరిన ఆమె మొత్తం మూడుసార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లారు. మొత్తంగా 608 రోజులు అంతరిక్షంలోనే ఉన్నారు. తొమ్మిదిసార్లు స్పేస్‌వాక్ చేశారు.
News January 21, 2026
173 బ్యాంక్ ఉద్యోగాలు.. అప్లై చేశారా?

యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్(<
News January 21, 2026
నన్ను చంపాలని చూస్తే ఇరాన్‌ను భూమ్మీదే లేకుండా చేస్తాం: ట్రంప్

తనను చంపేందుకు ఇరాన్ యత్నిస్తే ఆ దేశాన్ని భూస్థాపితం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ‘అధికారులకు ఇప్పటికే ఆదేశాలిచ్చా. నాపై హత్యాయత్నం జరిగి, అందులో ఇరాన్ హస్తం ఉందని తేలితే ఆ దేశాన్ని భూమిపై నుంచి తుడిచేయాలని చెప్పా’ అని అన్నారు. మరోవైపు దురాక్రమణకు చేయి చాపితే ఆ చేతిని నరికేస్తామని ట్రంప్‌కు తెలుసని, వాళ్ల ప్రపంచాన్ని తగలబెట్టేస్తామని ఇరాన్ భద్రతా దళాల ప్రతినిధి హెచ్చరించారు.


