News January 1, 2025

ఎల్లుండి నుంచి తెలుగు సమాఖ్య మహాసభలు

image

హైదరాబాద్ HICCలో జనవరి 3 నుంచి 12వ ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు జరగనున్నాయి. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలు, తెలుగు జాతి వారసత్వ సంపదను భావితరాలకు అందించేలా సమావేశాలు, చర్చలు, ప్రదర్శనలు నిర్వహించనున్నారు. 3న ఏపీ సీఎం చంద్రబాబు, 5న TG CM రేవంత్‌తో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు.

Similar News

News January 4, 2025

‘గేమ్ ఛేంజర్’ తర్వాత శంకర్ పాన్ వరల్డ్ మూవీ?

image

వరస ఫ్లాపుల్లో ఉన్న దర్శకుడు శంకర్ ‘గేమ్ ఛేంజర్’తో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా హిట్టైతే ఆయన తన డ్రీమ్ ప్రాజెక్టును తీసే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘వీరయుగ నాయగన్ వేల్పరి’ అనే పుస్తకం ఆధారంగా 3 భాగాల సినిమాను రూ.1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించాలని శంకర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, గేమ్ ఛేంజర్ రిజల్ట్‌పైనే ఆ ప్రాజెక్ట్ ఆధారపడినట్లు సమాచారం.

News January 4, 2025

మాల్దీవుల ప్రగతికి అండగా ఉంటాం: జైశంకర్

image

మాల్దీవుల ప్రగతికి, సుస్థిరతకు భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా ఖలీల్‌ న్యూఢిల్లీ పర్యటన సందర్భంగా ఢిల్లీలో జరిగిన భేటీ అనంతరం ఆయన పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో పొరుగు దేశాలతో సత్సంబంధాలను కొనసాగిస్తామని జైశంకర్ పేర్కొన్నారు. అటు.. భారత్‌తో బంధం బలోపేతానికి కట్టుబడి ఉన్నట్లు ఖలీల్ ట్వీట్ చేశారు.

News January 4, 2025

వినియోగదారులకు EPFO గుడ్ న్యూస్

image

పింఛనుదారులకు కేంద్ర కార్మిక శాఖ శుభవార్త చెప్పింది. ఇకపై దేశంలో ఎక్కడి నుంచైనా, ఏ బ్యాంకునుంచైనా పెన్షన్ తీసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. 68 లక్షలమంది లబ్ధిదారులు ఈ చర్యతో మేలు పొందుతారని పేర్కొంది. ఇప్పటి వరకూ EPFO కేవలం కొన్ని బ్యాంకులతోనే అగ్రిమెంట్ ఉన్న కారణంగా పింఛనుదారులు ఆయా బ్యాంకు శాఖలకు వెళ్లాల్సి వచ్చేది. ఇకపై ఆ భారం తప్పనుంది. ఈ నెల 1 నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది.