News November 30, 2024

తెలుగు టైటాన్స్ ఓటమి

image

ప్రోకబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ మరో ఓటమి చవిచూసింది. జైపూర్ పింక్ పాంథర్స్ చేతిలో 41-28 తేడాతో ఓడింది. హాఫ్ టైమ్‌లో 18-18తో ఇరు జట్లు సమంగా ఉండగా సెకండాఫ్‌లో జైపూర్ ఆటగాళ్లు ఆధిపత్యం చెలాయించారు. దీంతో టైటాన్స్‌కు ఓటమి తప్పలేదు. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌పై పట్నా పైరేట్స్ 54-29 తేడాతో గెలిచింది. పాయింట్స్ టేబుల్‌లో హరియాణా ఫస్ట్, టైటాన్స్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నాయి.

Similar News

News March 29, 2026

KKRvsMI.. వాంఖడే పిచ్ రిపోర్ట్ ఇదే

image

ఇవాళ రాత్రి ముంబైలోని వాంఖడే <<19504194>>వేదికగా<<>> KKR, MI మ్యాచ్ జరగనుంది. ఈ గ్రౌండ్ పిచ్‌ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటుంది. బ్యాటర్లు స్వేచ్ఛగా అన్నివైపులా పరుగులు చేసే వీలుంటుంది. ఫాస్ట్ బౌలర్లు ఆరంభంలో కాస్త స్వింగ్ రాబట్టవచ్చు. మ్యాచ్ జరిగే కొద్దీ స్పిన్నర్లు ప్రభావం చూపవచ్చు. సాధారణంగా ఇక్కడ టాస్ గెలిచిన జట్లు Dew కారణంగా ఛేజింగ్‌ను ఇష్టపడతాయి.
* ఇవాళ ఏ టీమ్ గెలుస్తుందో కామెంట్ చేయండి.

News March 29, 2026

అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెండ్

image

TG: అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యులను స్పీకర్ గడ్డం ప్రసాద్ రెండు రోజులపాటు సస్పెండ్ చేశారు. ఇవాళ, రేపు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే సభలో కడియం శ్రీహరి పట్ల <<19506649>>కౌశిక్ రెడ్డి<<>> వ్యవహరించిన తీరుపై ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. కౌశిక్ వ్యవహార శైలిని సమర్థిస్తే అసెంబ్లీలో కత్తిపోట్లు జరుగుతాయని, ఇలాంటి ఘటనలను సీరియస్‌గా తీసుకోవాలని సీఎం రేవంత్ అన్నారు.

News March 29, 2026

కాంగ్రెస్ పాలనలో స్కాములపై విచారణ జరిపించండి: BRS

image

TG: రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో దాదాపు అన్ని శాఖల్లో అక్రమాలు జరిగాయని BRS ఆరోపించింది. ఈ కుంభకోణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని CM రేవంత్‌కు BRSLP లేఖ రాసింది. 20 స్కాముల పేర్లను లేఖలో పేర్కొంది. అవినీతి, కుంభకోణాలపై లేఖ రాస్తే విచారణ జరిపిస్తానని CM రేవంతే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారని తెలిపింది. విచారణ జరగాలంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.