News December 15, 2024
అమెరికాలో తెలుగు యువతి మృతి

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా తెనాలి యువతి మృతి చెందారు. స్థానిక వ్యాపారి గణేష్, రమాదేవి దంపతుల కూతురు పరిమళ(26) MS చేయడానికి 2022లో US వెళ్లారు. అక్కడి టెన్నెసీ రాష్ట్రంలో ఉంటున్నారు. శుక్రవారం రాత్రి పరిమళ ప్రయాణిస్తున్న కారును ట్రక్ ఢీ కొట్టడంతో మృతి చెందారు. ఆమె మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు తానా ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News February 5, 2026
ప్రచార జోరు.. గత హామీలు నెరవేర్చారా?

TG: మున్సిపల్ ఎన్నికల వేళ ఓటర్లు అప్రమత్తంగా ఉండాలి. గత ఐదేళ్లలో మీ వార్డులో మౌలిక వసతులు మెరుగయ్యాయా? గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చారా? అని ఒక్కసారి ఆలోచించుకోవాలి. మళ్లీ ఓటు అడిగేందుకు వచ్చిన వారికి గత హామీలను గుర్తుచేయండి. డ్రైనేజీ, రోడ్డు, నీటి వసతులపై పట్టుబట్టండి. అభివృద్ధిని కాంక్షించే, ప్రజలకు అందుబాటులో ఉండే సమర్థుడైన నాయకుడికి జై కొట్టండి. మరి ఐదేళ్లలో మీ ఊరు ఏమైనా మారిందా? COMMENT
News February 5, 2026
ప్రైవేటు స్కూళ్లలో ఉచిత ప్రవేశాలకు షెడ్యూల్

AP: ప్రైవేటు స్కూళ్లలో RTE చట్టం కింద పేద, వెనుకబడిన వర్గాల పిల్లలకు 25% సీట్లు ఉచితంగా కేటాయిస్తున్నారు. ఇందులో భాగంగా 2026-27 ఏడాదికి 1వ తరగతిలో ప్రవేశానికి షెడ్యూల్ విడుదల అయ్యింది. FEB 6-16 వరకు పోర్టల్‌లోని స్కూళ్ల డేటాను అప్‌డేట్ చేస్తారు. FEB 20-MAR 10 వరకు విద్యార్థుల నమోదు ఉంటుంది. MAR 25న మొదటి విడత లాటరీ ద్వారా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తామని SSA డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.
News February 5, 2026
‘ఎనర్జీ’లో రూ.7.5 లక్షల కోట్ల పెట్టుబడి.. ఏపీకి నీతి ఆయోగ్ బ్లూ ప్రింట్

AP: నీతి ఆయోగ్ CEO సుబ్రహ్మణ్యం ఇవాళ సచివాలయంలో CS విజయానంద్‌ను కలిసి ఎనర్జీ ట్రాన్సిషన్ డ్రాఫ్ట్ బ్లూప్రింట్‌ను అందించారు. దీని అమలు ద్వారా రూ.7.5 లక్షల కోట్ల పెట్టుబడితో AP రెన్యువబుల్ ఎనర్జీ కేంద్రంగా మారుతుంది. 5 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. పగటి పూట నిరాటంక సరఫరాతోపాటు యూనిట్ విద్యుత్ కొనుగోలు ధర రూ.4కి, సరఫరా ఖర్చు రూ.6కు తగ్గుతుంది. కాగా దీని అమలుకు వార్ రూమ్‌ను ఏర్పాటు చేయనున్నారు.


