News March 22, 2024
తెలుగోడి సత్తా ఏంటో చూపనున్నారు!
మరికొన్ని గంటల్లో IPL-2024 సమరం మొదలుకానుంది. అయితే, ఈ సీజన్లో తెలుగోడి సత్తా ఏంటో చూపించేందుకు ఏడుగురు ప్లేయర్లు సిద్ధంగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన షేక్ రషీద్, నితీశ్ కుమార్ రెడ్డి, కోన శ్రీకర్ భరత్, మొహమ్మద్ సిరాజ్, తిలక్ వర్మ, రిక్కీ, ఆరవెల్లి అవినాశ్ ఈ టోర్నీలో ఆడుతున్నారు. ఈక్రమంలో స్టార్ స్పోర్ట్స్ స్పెషల్ పోస్టర్ను విడుదల చేసింది.
Similar News
News December 28, 2024
నిధుల బదిలీతో నాకు సంబంధం లేదు: కేటీఆర్
TG: ఫార్ములా-ఈ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఒప్పందాల అమలు, డబ్బు చెల్లింపుతో తనకు సంబంధం లేదని, విధానపరమైన అంశాలు చూసే బాధ్యత తనది కాదని పేర్కొన్నారు. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపులపై అనుమతుల బాధ్యత సంబంధిత బ్యాంక్దేనని తెలిపారు. చెల్లింపుల విషయంలో అన్ని అంశాలను HMDAనే చూసుకోవాలన్నారు.
News December 28, 2024
తండ్రి త్యాగానికి ఫలితం నితీశ్ సెంచరీ: ఎమ్మెస్కే
బాక్సింగ్ డే టెస్టులో నితీశ్ రెడ్డి సెంచరీ చేయడంతో సగటు తెలుగువాడిగా గర్విస్తున్నానని ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు. ‘నితీశ్ నాకు 11 ఏళ్లప్పటి నుంచి తెలుసు. ఈ పదేళ్లలో అతడు ఎంతో కష్టపడ్డారు. ముఖ్యంగా అతడిని ఈ స్థానంలో నిలిపేందుకు నితీశ్ తండ్రి ఎన్నో త్యాగాలు చేశారు. తన ఉద్యోగం కూడా కోల్పోవాల్సి వచ్చింది. డబ్బులకు ఎంతో ఇబ్బంది పడ్డారు. చివరికి ఫలితం ఈ విధంగా రావడం సంతోషం’ అని ఎమ్మెస్కే తెలిపారు.
News December 28, 2024
గాజాలో ఆస్పత్రిని తగలబెట్టిన ఇజ్రాయెల్ సైనికులు
వెస్ట్ ఏషియా మళ్లీ రగిలిపోతోంది. ఇజ్రాయెల్ సైనికులు కమల్ అద్వాన్ ఆస్పత్రిలో ప్రవేశించి పేషంట్లు, వైద్యులను పంపించేశారు. ప్రాంగణంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉందన్న సమాచారంతో దానిని తగలబెట్టేశారు. మరోవైపు యెమెన్ నుంచి హౌతీలు ప్రయోగించిన మిసైళ్లను IDF అడ్డుకుంది. సరిహద్దుకు బయటే కూల్చేసినా దేశంలో సైరన్లు మోగినట్టు ప్రకటించింది. గురువారం యెమెన్ విమానాశ్రయాలపై దాడికి నిరసనగా హౌతీలు ప్రతిదాడి చేశారు.