News July 13, 2024
కువైట్‌లో తెలుగోడి కష్టాలు.. Way2News కథనం చూసి స్పందించిన లోకేశ్

AP: కువైట్‌లో అష్టకష్టాలు పడుతున్న ఓ తెలుగు వ్యక్తి ఆవేదనను <<13623419>>’VIRAL: కువైట్‌లో కష్టాలు.. కాపాడాలని వ్యక్తి వీడియో’<<>> శీర్షికతో Way2News ప్రచురించిన కథనం ప్రభుత్వాన్ని కదిలించింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరలై మంత్రి లోకేశ్ వరకూ వెళ్లింది. వెంటనే ఆయన స్పందించి, అతడిని భారత్ తీసుకురావాలని భారత విదేశాంగ శాఖను కోరారు. తన కష్టంపై స్పందించిన వే2న్యూస్‌తో పాటు లోకేశ్‌కు బాధితుడు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News March 26, 2026
ఏదో ఒకటి తేల్చుకోండి.. లేకపోతే: ట్రంప్

తమతో డీల్ కోసం ఇరాన్ అడుక్కుంటోందని US అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. కానీ బయటి ప్రపంచానికి మాత్రం మరోలా చెబుతోందన్నారు. ఏదో ఒక విషయం ఆ దేశం త్వరగా తేల్చుకోకపోతే పరిస్థితులు భయానకంగా ఉంటాయని హెచ్చరించారు. తాము ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తిరిగి చూడబోమని తేల్చి చెప్పారు. కాగా 5 రోజులు యుద్ధానికి బ్రేక్ ఇచ్చామని ఇటీవల ఆయన ప్రకటించగా, తమకు అగ్రరాజ్యం భయపడిందని ఇరాన్ చెప్పిన విషయం తెలిసిందే.
News March 26, 2026
మొదలైన SRHvsLSG టికెట్ల సేల్స్

IPL-2026 సందడి మొదలైంది. ఏప్రిల్ 5న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే SRHvsLSG మ్యాచ్ టికెట్లు రిలీజ్ అయ్యాయి. District యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లను <
News March 26, 2026
విశాఖకు చేరుకున్న భారీ నౌకలు

AP: గ్యాస్, పెట్రోల్ ఇబ్బందుల నేపథ్యంలో విశాఖ తీరానికి భారీ LPG, చమురు నౌకలు చేరుకున్నాయి. 47 వేల టన్నుల ఎల్‌పీజీతో BW Birch షిప్, 28 వేల టన్నుల క్రూడాయిల్‌తో MT Petroit షిప్ పోర్టుకు వచ్చాయి. యూఏఈ నుంచి ఈ రెండు నౌకలు ఈ నెల 20న బయలుదేరాయి. మధ్యలో వడినార్, ముంద్రా పోర్టుల్లో కొంత LPG, క్రూడ్‌ను దిగుమతి చేశాయి. తాజాగా వైజాగ్ హార్బర్ మౌత్‌లో లంగరేశాయి.


