News December 23, 2024
అమెరికా జట్టు కెప్టెన్‌గా తెలుగమ్మాయి

వచ్చే ఏడాది జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు మలేషియా వేదికగా అండర్-19 టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్ జరగనుంది. ఇందులో పాల్గొనే అమెరికా జట్టుకు తెలుగు యువతి కొలన్ అనికా రెడ్డి కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. తెలుగు సంతతికి చెందిన చేతనారెడ్డి, ఇమ్మడి శాన్వి, సాషా వల్లభనేని కూడా అమెరికా తరఫున బరిలో దిగనున్నారు. జట్టులోని 15 మందిలో దాదాపు అందరూ ఇతర దేశాల సంతతికి చెందిన వారే కావడం గమనార్హం.
Similar News
News December 28, 2025
గాదె ఇన్నయ్య ‘మా ఇల్లు’కు మంత్రి సీతక్క

TG: జనగామ జిల్లా జాఫర్‌గఢ్‌లోని <<18631208>>గాదె ఇన్నయ్య <<>>నిర్వహిస్తున్న ‘మా ఇల్లు’ అనాథాశ్రమాన్ని మంత్రి సీతక్క ఇవాళ సందర్శించారు. ఇన్నయ్యను మిస్ అవుతున్నామని కన్నీళ్లు పెట్టుకుంటున్న పిల్లలను ఓదార్చి ధైర్యంగా ఉండాలని సూచించారు. చదువుకు, బసకు అవసరమైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సాగరం గ్రామంలోని ఇన్నయ్య ఇంటికి వెళ్లి అనారోగ్యంతో మంచానికే పరిమితమైన ఆయన తల్లిదండ్రులను పరామర్శించారు.
News December 28, 2025
స్మృతి మంధాన అరుదైన ఘనత

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ క్రికెట్‌లో 10వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో ఇండియన్‌గా, ఓవరాల్‌గా నాలుగో బ్యాటర్‌గా రికార్డులకెక్కారు. తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో మ్యాచ్‌లో ఈ ఘనత సాధించారు. అత్యధిక రన్స్ చేసిన మహిళా క్రికెటర్స్ లిస్ట్‌లో స్మృతి మంధాన కంటే ముందు IND-మిథాలీ రాజ్(10,868), NZ-సుజీ బేట్స్(10,652), ENG-షార్లెట్(10,273) ఉన్నారు.
News December 28, 2025
శబరిమల మకరజ్యోతి దర్శనం ఎప్పుడు?

అయ్యప్ప స్వామి భక్తులు ఎంతగానో ఎదురుచూసే శబరిమల మకరజ్యోతి 2026లో జనవరి 14న కనిపించనుంది. ఆ రోజు సాయంత్రం 6:30 నుంచి 6:55 గంటల మధ్య పొన్నాంబలమేడు వద్ద దర్శనమిస్తుందని అంచనా. జ్యోతి దర్శనార్థం వచ్చే భక్తులు ముందుగానే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని దేవస్వం బోర్డు సూచించింది. జనవరి 19 రాత్రి వరకు దర్శనానికి అవకాశం ఉండగా 20వ తేదీన ఆలయం మూసివేయనున్నారు.


