News September 11, 2024
ధోనీని హైలెట్ చేయడం తెలుగోళ్లకు నచ్చలేదు: ‘ది గోట్’ డైరెక్టర్

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘ది గోట్’ మూవీపై డైరెక్టర్ వెంకట్ ప్రభు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రంలో భారత క్రికెట్ దిగ్గజం ధోనీని, సీఎస్కేను హైలెట్ చేయడం తెలుగుతోపాటు హిందీ ప్రేక్షకులకు నచ్చలేదని చెప్పారు. అందుకే అక్కడ ఈ సినిమా ఆశించినంత కలెక్షన్లు రాబట్టలేకపోయిందని తెలిపారు. ప్రస్తుతం డైరెక్టర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు.
Similar News
News December 7, 2025
విద్యార్థి ఇంటి ముందు ఉపాధ్యాయుల ధర్నా

TG: విద్యార్థి స్కూలుకు రాలేదని టీచర్లు ధర్నా చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. దుమ్ముగూడెం మండలం నిమ్మలగూడెంలో నాలుగో తరగతి స్టూడెంట్ వారం నుంచి స్కూలుకు రావట్లేదు. పేరెంట్స్ని అడిగితే సమాధానం లేదు. దాంతో ఆ ప్రాథమిక పాఠశాల టీచర్లు మిగిలిన విద్యార్థులతో కలిసి ఆ పిల్లాడి ఇంటి ముందు బైఠాయించారు. సోమవారం నుంచి పిల్లాడిని బడికి పంపుతామని పేరెంట్స్ హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.
News December 7, 2025
ఆ లంబాడీలు ఎస్టీలు కాదు: హైకోర్టు

TG: 1956 తర్వాత మహారాష్ట్ర నుంచి వలస వచ్చి తెలంగాణలో స్థిరపడ్డ లంబాడీలు ఎస్టీ క్యాటగిరీ కిందకు రాబోరని హైకోర్టు స్పష్టం చేసింది. తమ ఎస్టీ సర్టిఫికెట్ను రద్దు చేశారని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన హాన్ దేవానంద్ కుటుంబం హైకోర్టుకు వెళ్లింది. 1950 నాటికి తెలంగాణలో నివసించే లంబాడీలు, వారి పూర్వీకులు, మహారాష్ట్ర నుంచి వచ్చిన లంబాడీలకు మాత్రమే ఎస్టీ క్యాటగిరీ వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది.
News December 7, 2025
20 ఏళ్లు దాటిన తర్వాత మహిళలు ఈ టెస్టులు చేయించుకోవాలి

20 ఏళ్ల తర్వాత మహిళల శరీరంలో చాలా మార్పులు వస్తాయి. అందుకే మహిళలు 20 ఏళ్ల తర్వాత కొన్ని పరీక్షలు తప్పకుండా చేయించుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు నిపుణులు. HPV టెస్ట్, STD టెస్ట్, షుగర్, బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. అలాగే ఎప్పటికప్పుడు నెలసరిని వస్తుందా.. లేదా.. ఏవైనా హార్మోన్ సమస్యలున్నాయా అన్నవీ చెక్ చేసుకోవాలి. వీటితో పాటు హెల్తీ పుడ్, వ్యాయామం చేయడం మంచిదని సూచిస్తున్నారు.


