News January 7, 2025
టెంబా బవుమా సరికొత్త రికార్డ్

సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా సరికొత్త ఘనత సాధించారు. తొలి 9 టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన నాలుగో కెప్టెన్‌గా బవుమా నిలిచారు. ఇప్పటివరకు తన సారథ్యంలో 9 టెస్టులు ఆడి వరుసగా 8 గెలుపొందగా, ఒకటి డ్రా చేసుకున్నారు. పాకిస్థాన్‌పై విజయంతో ఈ ఫీట్ సాధించారు. పెర్సీ చాప్‌మన్ (ENG) తొలి తొమ్మిది మ్యాచులనూ గెలిపించారు. ఆ తర్వాత వార్విక్ ఆర్మ్‌స్ట్రాంగ్ (8 AUS), లిండ్సే హస్సెట్ (8 AUS) ఉన్నారు.
Similar News
News December 10, 2025
SRCL: ఎన్నికల నిర్వహణకు పటిష్ఠ బందోబస్తు: SP

ఎన్నికల నిర్వహణకు సంబంధించి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ మహేశ్ బి గితే తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు. ఎక్కడైనా సమస్యలుంటే అధికారులు వెంటనే తెలియజేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో RDOలు వెంకటేశ్వర్లు, రాధా భాయ్, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, నోడల్ అధికారులు శేషాద్రి, లక్ష్మీరాజం పాల్గొన్నారు.
News December 10, 2025
అంతర పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

దీర్ఘకాలిక పంటల మధ్య.. స్వల్పకాలిక పంటలను అంతర పంటలుగా వేసుకోవాలి. పప్పు జాతి రకాలను సాగు చేస్తే పోషకాలను గ్రహించే విషయంలో పంటల మధ్య పోటీ ఉండదు. ప్రధాన పంటకు ఆశించే చీడపీడలను అడ్డుకునేలా అంతరపంటల ఎంపిక ఉండాలి. ప్రధాన, అంతర పంటలపై ఒకే తెగులు వ్యాపించే ఛాన్సుంటే సాగు చేయకపోవడం మేలు. చీడపీడల తాకిడిని దృష్టిలో ఉంచుకొని పంటలను ఎంచుకోవాలి. సేంద్రియ ఎరువుల వాడకంతో ఎక్కువ దిగుబడి పొందవచ్చు.
News December 10, 2025
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<


