News April 25, 2025

45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. రెడ్ అలర్ట్ జారీ

image

TG: రాష్ట్రంలో ఎండలు తీవ్రమయ్యాయి. నిన్న నిజామాబాద్, ADLB, నిర్మల్, MNCLలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా NZMBలోని సీహెచ్ కొండూరులో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్లకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు పలు జిల్లాల్లో 3 రోజుల పాటు ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Similar News

News April 25, 2025

OTTలోకి వచ్చేసిన కొత్త చిత్రాలు

image

సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మ్యాడ్ స్క్వేర్’ ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మార్చి 28న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం హిట్ అయిన విషయం తెలిసిందే. అలాగే బాలీవుడ్ స్టార్లు సైఫ్ అలీఖాన్, జైదీప్ అహ్లావత్ నటించిన ‘జ్యువెల్ థీఫ్’ మూవీ నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది.

News April 25, 2025

హిండెన్‌బర్గ్‌తో కలిసి పనిచేసిన రాహుల్ గాంధీ?

image

అదానీ గ్రూప్‌ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హిండెన్‌బర్గ్ సంస్థతో కలిసి పనిచేశారని స్పుత్నిక్ ఇండియా నివేదిక తెలిపింది. ఆ విషయాన్ని ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ కనిపెట్టిందని పేర్కొంది. ‘2023, మేలో హిండెన్‌బర్గ్‌కు సంబంధించిన వారితో కాలిఫోర్నియాలో రాహుల్ భేటీ అయ్యారు. రాహుల్‌కు సన్నిహితుడైన శామ్ పిట్రోడా ఈ-మెయిల్స్‌ను హ్యాక్ చేయడం ద్వారా మొసాద్ ఈ సంగతి గుర్తించింది’ అని తెలిపింది.

News April 25, 2025

మేధా పాట్కర్‌ అరెస్ట్

image

సామాజిక కార్యకర్త మేధాపాట్కర్‌ను పరువునష్టం కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. 2000లో ‘నర్మదా బచావో’ ఆందోళనకు వ్యతిరేకంగా ప్రస్తుత LG VK సక్సేనా ప్రకటనలు ప్రచురించారని ఆరోపిస్తూ ఆయనపై పాట్కర్‌ కేసు వేశారు. అదే సమయంలో ఓ ఇంటర్వ్యూలో తన పరువుకు భంగం కలిగించేలా మాట్లాడారని ఆమెపై సక్సేనా సైతం పరువు నష్టం దావా వేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఇటీవల ఆమెకు కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

error: Content is protected !!