News April 7, 2024
45 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు!

AP: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 45 డిగ్రీలకు చేరుకున్నాయి. నిన్న 7 జిల్లాల్లో దాదాపు 45 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. సగానికి పైగా మండలాల్లో వడగాడ్పులు వీచాయని పేర్కొంది. అనకాపల్లి(D) రావికమతం, నంద్యాల(D) బ్రాహ్మణ కొట్కూరు, పల్నాడు(D) రావిపాడు, ప్రకాశం (D) తోకపల్లె, 44.9 డిగ్రీలు నమోదైందని వెల్లడించింది. మిగతా ప్రాంతాల్లో 40-44 డిగ్రీల మధ్య నమోదైనట్లు తెలిపింది.
Similar News
News October 20, 2025
BDLలో 110 పోస్టులు

సంగారెడ్డిలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్(BDL) 2025-26 సంవత్సరానికి 110 అప్రెంటిస్ ఖాళీలకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు ఈ నెల 30 వరకు www.apprenticeshipindia.gov.in పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా ప్రకటిస్తారు. వెబ్సైట్: https://bdl-india.in/
News October 20, 2025
కానిస్టేబుల్ హత్య.. నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్

TG: నిజామాబాద్లో గత శుక్రవారం కానిస్టేబుల్ ప్రమోద్ను కత్తితో పొడిచి చంపిన నిందితుడు <<18051417>>రియాజ్<<>> ఎన్కౌంటర్లో మరణించాడు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడు AR కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కుని పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో రియాజ్ చనిపోయాడు. ఇతడిపై 60కి పైగా కేసులు ఉన్నాయి. సీపీ దీనిపై మీడియాతో మాట్లాడనున్నారు.
News October 20, 2025
ONGCలో 566 పోస్టులు.. అడ్మిట్ కార్డులు విడుదల

ONGC 566 గ్రాడ్యుయేట్, డిప్లొమా ఇంజినీర్ పోస్టులకు సంబంధించి అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. అభ్యర్థులు <