News January 28, 2025
రాష్ట్రంలో టెంపుల్, ఎకో, హెల్త్ టూరిజం వెనకబడుతోంది: CM

అన్ని సహజ వనరులు ఉన్న తెలంగాణపై గత ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదని CM రేవంత్ అన్నారు. ప్రొద్దుటూరులో ఎక్స్పీరియం పార్కు ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ ‘రాష్ట్రంలో టెంపుల్, ఎకో, హెల్త్ టూరిజం వెనకబడుతోంది. మందిరాలు, అటవీ ప్రదేశాల సందర్శన కోసం ప్రజలు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోంది. పర్యాటక పాలసీ తీసుకువచ్చి ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తాం. త్వరలో వికారాబాద్ను అభివృద్ధి చేస్తాం’ అని తెలిపారు.
Similar News
News December 1, 2025
గుమ్మలక్ష్మీపురం: చలికి వణకుతూ.. వానకు తడుస్తూ విద్యా పయనం

గుమ్మలక్ష్మీపురం మండలం బాలేసు పంచాయతీ గాండ్ర గ్రామంలో 5వ తరగతి లోపు చదువుతున్న విద్యార్థులు సుమారు 18 మంది ఉన్నారు.అయితే గ్రామంలో పాఠశాల లేకపోవడంతో తమ పిల్లలు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న దాదుపురం కాలినడకన వెళ్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. శీతాకాలంలో చల్లని గాలులకు,వర్షాకాలంలో వానలకు పిల్లలు ఇబ్బందులు పడుతూ పాఠశాలకు వెళ్తున్నారని,అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
News December 1, 2025
25,487 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. రిజిస్ట్రేషన్ షురూ

సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో 25,487 కానిస్టేబుల్(GD)ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 31 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుల్లో తప్పులను జనవరి 8, 9, 10 తేదీల్లో కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. BSF, CISF, CRPF, SSB, ITBP, SSF, అస్సాం రైఫిల్స్ విభాగాల్లో ఖాళీలున్నాయి.
వెబ్సైట్: <
News December 1, 2025
కోలుకున్న గిల్, హార్దిక్.. సౌతాఫ్రికాతో టీ20లు ఆడే ఛాన్స్!

గాయాల కారణంగా కొన్ని రోజులుగా క్రికెట్కు దూరమైన కెప్టెన్ శుభ్మన్ గిల్, ఆల్రౌండర్ హార్దిక్ కోలుకున్నట్లు సమాచారం. హార్దిక్ T20లలో ఆడేందుకు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ క్లియరెన్స్ ఇచ్చినట్లు క్రిక్బజ్ వెల్లడించింది. గిల్కు కూడా అనుమతి ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపింది. దీంతో సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్లో వీరు ఆడే ఛాన్స్ ఉంది. వీరి రాకతో టీమ్ ఇండియా బలం పెరగనుంది.


