News May 25, 2024
అమ్మానాన్నలకు గుడి.. నిత్య పూజలు
TG: కన్నవాళ్లకు అన్నం పెట్టని బిడ్డలను చూస్తున్న ఈరోజుల్లో తల్లిదండ్రులకు గుడికట్టి ముగ్గురు కుమారులు నిత్యం పూజలు చేస్తున్నారు. సిద్దిపేట(D) అక్కన్నపేటకు చెందిన గొట్టె కనకయ్య, కొమురవ్వ దంపతులకు సదయ్య, మహేందర్, చిరంజీవి సంతానం. 4 ఏళ్ల క్రితం తల్లి, గతేడాది తండ్రి మృతి చెందగా.. నిత్యం తమ కళ్ల ముందే ఉండేలా పొలంలో గుడి నిర్మించి, విగ్రహాలను ప్రతిష్ఠించారు. నిన్న తండ్రి ప్రథమ వర్ధంతి నిర్వహించారు.
Similar News
News December 28, 2024
షాకింగ్: బేబీ బంప్‌తో సమంత.. నిజమిదే!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. టెక్నాలజీ చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా హీరోయిన్ సమంత బేబీ బంప్‌తో ఉన్నట్లు ఫొటోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. తొలుత ఇవి చూసి ఆమె ఫ్యాన్స్ షాక్ అయ్యారు. క్షుణ్ణంగా పరిశీలిస్తే AI ఇమేజెస్ అని తేలాయి. దీంతో వీటిని తయారుచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
News December 28, 2024
మన్మోహన్‌ను కేంద్రం అవమానించింది: రాహుల్
భారతమాత ముద్దుబిడ్డ, తొలి సిక్కు ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ప్రస్తుత ప్రభుత్వం అవమానించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటివరకు మాజీ ప్రధానులందరి అంత్యక్రియలను అధికారిక శ్మశానవాటికలో నిర్వహించారు. కానీ మన్మోహన్ చివరి కార్యక్రమాలు నిగమ్‌బోధ్ ఘాట్‌లో జరిపి అవమానించారు’ అని మండిపడ్డారు. అలాగే సింగ్‌కు మెమోరియల్ ఏర్పాటు చేసి, ఆయనపై గౌరవాన్ని చాటుకోవాలని సూచించారు.
News December 28, 2024
ట్రంప్ X మస్క్: తెరపైకి INDIA FIRST వివాదం
వలస విధానంపై ట్రంప్ కూటమిలో నిప్పు రాజుకుంది. టాప్ టాలెంట్ ఎక్కడున్నా USకు ఆహ్వానించాలని మస్క్, వివేక్ అంటున్నారు. మెరిట్ ఆధారిత ఇమ్మిగ్రేషన్ అవసరమని, భారత్‌లాంటి దేశాలకు పరిమితి విధించొద్దని సూచిస్తున్నారు. అమెరికన్ల ప్రతిభకేం తక్కువంటున్న ట్రంప్ సపోర్టర్స్ వీసాలపై పరిమితి ఉండాలని వాదిస్తున్నారు. గతంలో ‘INDIA FIRST’ అంటూ ట్వీట్ చేసిన శ్రీరామ్ కృష్ణన్ AI సలహాదారుగా ఎంపికవ్వడంతో రచ్చ మొదలైంది.