News February 17, 2025
దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం కీలకం: చంద్రబాబు

AP: దేవాలయాలు ఆథ్యాత్మిక కేంద్రాలే కాకుండా అభివృద్ధికి ప్రధాన ఆదాయ వనరులని CM చంద్రబాబు అన్నారు. దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం ప్రత్యేకమని చెప్పారు. తిరుపతిలో జరుగుతున్న ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ ఈవెంట్లో CM మాట్లాడారు. ‘ఆలయాలకు వచ్చిన విరాళాలను పేదల సంక్షేమం కోసం ఉపయోగిస్తున్నాం. మన సంస్కృతి, వారసత్వ పరిరక్షణలో ఆలయాలది కీలక పాత్ర. ఆధ్యాత్మికత వైపు అందరూ అడుగేయాలి’ అని పేర్కొన్నారు.
Similar News
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.
News December 2, 2025
ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్: కేంద్రం

గత ఐదేళ్లలో దేశంలో 2,04,268 ప్రైవేట్ కంపెనీలు మూతపడ్డాయని లోక్సభలో కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా వెల్లడించారు. విలీనాలు, రిజిస్ట్రేషన్ రద్దు వంటి రీజన్స్తో ఇవి క్లోజ్ అయ్యాయని తెలిపారు. అత్యధికంగా 2022-23లో 83,452, అత్యల్పంగా 2020-21లో 15,216 కంపెనీలు మూత పడ్డాయని పేర్కొన్నారు. ఆయా సంస్థల ఉద్యోగులకు పునరావాసం కల్పించే ప్రతిపాదన ప్రభుత్వానికి లేదని చెప్పారు.


