News July 6, 2024

అమర్‌నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్

image

అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా యాత్రకు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించారు. యాత్రికుల భద్రత నిమిత్తం ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రెండు మార్గాల్లోనూ నిలిపివేసినట్లు స్పష్టం చేశారు. మరోవైపు గుహలోని మంచు శివలింగం కరిగిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత వారంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండటంతో కరిగిపోతున్నట్లు సమాచారం.

Similar News

News October 17, 2025

మునగ సాగుకు ప్రభుత్వ సబ్సిడీలు ఇలా..

image

AP: మునగ సాగును ఉపాధి హామీ పథకానికి ప్రభుత్వం అనుసంధానించింది. గుంతలు తీయడం, మొక్కలు నాటడం, నీరు పెట్టడానికి డబ్బు చెల్లిస్తుంది. 25సెంట్లలో నాటితే రెండేళ్లలో ₹38,125, 50 సెంట్లకు ₹75,148, 75 సెంట్లకు ₹1.25L, ఎకరాకు ₹1.49L ఆర్థిక భరోసా ఉంటుంది. ఈ ఏడాది 12 జిల్లాల్లో(అన్నమయ్య, అనంతపురం, అనకాపల్లి, బాపట్ల, చిత్తూరు, నంద్యాల, గుంటూరు, ప్రకాశం, సత్యసాయి, శ్రీకాకుళం, పల్నాడు, తిరుపతి) అమలు చేస్తోంది.

News October 17, 2025

మునగ.. ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు సాయం

image

AP: మునగ సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం చేయూతనందిస్తోంది. డ్వాక్రా మహిళ కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని, ప్లాంట్ వ్యయాన్ని బట్టి ₹10L, ఆపైన కూడా సెర్ప్ ద్వారా రుణం మంజూరు చేయిస్తుంది. మునగ ప్రొడక్ట్‌లను కొనుగోలు చేసేలా ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలు చేసుకోనుంది. దీనిద్వారా ఆయా కుటుంబాలు ఆర్థికంగా లాభపడనున్నాయి. పూర్తి వివరాలకు వ్యవసాయ అధికారులను సంప్రదించండి.

News October 17, 2025

‘డ్యూడ్’ రివ్యూ&రేటింగ్

image

ఎంతో ఇష్టపడే మరదలి ప్రేమను హీరో రిజక్ట్ చేయడం, తిరిగి ఎలా పొందాడనేదే ‘డ్యూడ్’ స్టోరీ. లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో యూత్‌లో క్రేజ్ తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథ్ మరోసారి ఎనర్జిటిక్ యాక్టింగ్‌తో అలరించారు. హీరోయిన్ మమితా బైజు స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. కథ పాతదే అయినా కామెడీ, ట్విస్టులు బోర్ కొట్టకుండా చేస్తాయి. సెకండాఫ్ స్లోగా ఉండటం, ఎమోషన్స్ అంతగా కనెక్ట్ అవ్వకపోవడం మైనస్.
RATING: 2.75/5