News May 7, 2025

SLBC టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

image

TG: SLBC టన్నెల్‌లో సహాయక చర్యలకు అధికారులు 3 నెలల విరామం ఇచ్చారు. డేంజర్ జోన్ మినహా శిథిలాల తొలగింపు పూర్తికాగా, తాజాగా ఎక్స్‌కవేటర్లు సొరంగం నుంచి బయటకు వచ్చాయి. ఇంకా ఆరుగురు కార్మికుల ఆచూకీ లభించలేదు. 63 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టగా, ఇప్పటివరకు రెండు మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. ఫిబ్రవరి 22న సొరంగంలో ప్రమాదం జరగగా, 8 మంది అందులో చిక్కుకున్న సంగతి తెలిసిందే.

Similar News

News January 22, 2026

హత్యారాజకీయాలతో విషబీజాలు నాటుతున్న CBN: జగన్

image

AP: హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ CBN నాటుతున్న విషబీజాలు చెట్లుగా మారి కంట్రోల్ కాని పరిస్థితులు వస్తాయని జగన్ హెచ్చరించారు. ‘ఇళ్లు, ఆస్తులు వదిలి ఊళ్లు వదిలి వెళ్లిపోయేలా YCP వారిపై కూటమి నేతలు దౌర్జన్యాలు చేస్తున్నారు. మా కార్యకర్తలను చంపేస్తున్నారు. బాధిత కుటుంబాలు రేపు చూస్తూ ఊరుకుంటాయా? పోలీసులు, MLAలు, CBN బాధ్యత వహించకతప్పదు’ అని పేర్కొన్నారు. పాలకులన్నవారు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.

News January 22, 2026

ప్రపంచంలోనే రద్దీ నగరాలు.. 2వ స్థానంలో బెంగళూరు

image

ప్రపంచంలోనే రద్దీగా ఉండే నగరాల జాబితాలో బెంగళూరు 2వ ప్లేస్‌లో నిలిచింది. డచ్ లొకేషన్ టెక్నాలజీ స్పెషలిస్ట్ టామ్‌టామ్ 2025 ట్రాఫిక్ ఇండెక్స్ ప్రకారం బెంగళూరులో సగటు ప్రయాణ వేగం 16.6KM/hr. రద్దీ స్థాయి 74.4%. 2024తో పోలిస్తే ట్రాఫిక్ 1.7% పెరిగింది. ట్రాఫిక్ లేట్‌తో బెంగళూరు వాసులు ఏడాదిలో 168గంటలు కోల్పోయారు. పుణే 71.1% రద్దీతో 5వ, ముంబై 65.2%తో 18వ స్థానంలో ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్‌లో మెక్సికో ఉంది.

News January 22, 2026

వైట్ హెడ్స్ ఇలా తొలగిద్దాం..

image

చర్మంపై చాలా చిన్నగా తెల్లని మచ్చల్లా ఉండే వైట్ హెడ్స్ సమస్యను తగ్గించుకోవాలంటే ఈ టిప్స్ పాటించండి. * రెండు చెంచాల ఓట్స్ పొడిలో నీళ్లు కలిపి మెత్తని ముద్దలా చేసి సమస్య ఉన్న చోట రాయాలి. పదిహేను నిమిషాల తర్వాత కడిగెయ్యాలి. * చెంచా వంటసోడాలో కాసిని నీళ్లు కలిపి వైట్ హెడ్స్ ఉన్న చోట రాయాలి. ఆ వంట సోడా పూత ఆరిపోయాక కడిగేయాలి. ఇలా తరచూ చేస్తోంటే అధిక జిడ్డు పోవడమే కాదు, వైటెడ్స్ సమస్య కూడా తగ్గుతుంది.