News March 17, 2024

స్పందన తాత్కాలికంగా నిలుపుదల: కలెక్టర్ రాజబాబు

image

సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినందున కలెక్టర్ రాజబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. మచిలీపట్టణం కలెక్టరేట్‌లో రేపు సోమవారం జరగవలసిన స్పందన కార్యక్రమం తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజానీకం, సంబంధిత అధికారులు ఈ విషయం గమనించవలసిందిగా కలెక్టర్ కోరారు.

Similar News

News February 4, 2026

త్వరలో చల్లపల్లి మండలంలో సీఎం చంద్రబాబు సభ

image

CM చంద్రబాబు త్వరలో కృష్ణా జిల్లా చల్లపల్లి మండలంలో సభ నిర్వహించే అవకాశం ఉంది. ఈ మేరకు సీఎం సభ నిర్వహణకు అనువైన స్థలాల ఎంపికకు జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ మంగళవారం పురిటిగడ్డ జడ్పీ హైస్కూల్, మేకావారిపాలెంలో పీఏసీఎస్ ఛైర్మన్ గుత్తికొండ వంశీకృష్ణ పొలం, చల్లపల్లి రాజా హైస్కూల్ గ్రౌండ్, పాగోలు ఎన్టీఆర్ స్కూల్ గ్రౌండ్ పరిశీలించారు. తేదీ ఖరారు కాగానే స్థలం ఫైనల్ చేస్తామని ఆయన తెలిపారు.

News February 3, 2026

గన్నవరం: విద్యార్థులకు గుడ్ న్యూస్

image

వ్యవసాయ విద్యనభ్యసించే విద్యార్థులకు శుభవార్త. గన్నవరంలో నూతన ప్రభుత్వ అగ్రికల్చర్ కాలేజీ ప్రారంభానికి సిద్ధమైంది. అత్యాధునిక ల్యాబ్‌లు, డిజిటల్ క్లాస్ రూమ్‌లు, హాస్టల్ సౌకర్యాలతో ఈ కళాశాలను తీర్చిదిద్దారు. ప్రయోగాత్మక విద్య, పరిశోధనలకు ఇక్కడ పెద్దపీట వేయనున్నారు. ఈ కళాశాల అందుబాటులోకి రావడం వల్ల స్థానిక విద్యార్థులతో పాటు చుట్టుపక్కల జిల్లాల వారికి వ్యవసాయ రంగంలో మెరుగైన అవకాశాలు లభించనున్నాయి.

News February 3, 2026

కృష్ణా జిల్లా రైతుల్లో కలవరం..!

image

కృష్ణా జిల్లాలో అపరాల సాగు కీలక దశకు చేరుకోగా, ఎలుకల బెడద రైతులను వణికిస్తోంది. పూత, కాయ దశలో ఉన్న పంటను మూషికాలు కొరికి నాశనం చేస్తుండటంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నివారణ చర్యల కోసం గతంలో కంటే మూడు రెట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. వ్యవసాయ శాఖ వెంటనే స్పందించి, ఎలుకల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేయాలని కోరుతున్నారు.