News April 22, 2025

పదేళ్ల పిల్లలకూ సొంతంగా బ్యాంక్ లావాదేవీలకు అనుమతి

image

ప్రస్తుతం మైనర్లకు బ్యాంక్ అకౌంట్లు తీసుకునే సదుపాయం ఉన్నప్పటికీ ఎవరైనా గార్డియన్‌గా ఉండటం తప్పనిసరి. ఇకపై పదేళ్లు దాటిన పిల్లలు కూడా ఖాతాలను సొంతంగా నిర్వహించుకునేలా RBI మార్గదర్శకాలను విడుదల చేసింది. సేవింగ్స్, టర్మ్ డిపాజిట్ అకౌంట్లను తెరిచి లావాదేవీలను సాగించవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ATM, చెక్ బుక్ సదుపాయమూ ఉంటుంది. జులై 1 నుంచి ఈ రూల్స్‌ను అమలు చేయాలని బ్యాంకులను RBI ఆదేశించింది.

Similar News

News April 22, 2025

ALERT: భక్తులకు TTD కీలక సూచన

image

వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈక్రమంలో భక్తులకు TTD కీలక సూచన చేసింది. చాలా మంది తమకు కేటాయించిన టైమ్ స్లాట్‌కు బదులు ముందే వచ్చి క్యూలో నిల్చుంటున్నారని మండిపడింది. రద్దీ అధికంగా ఉండటంతో ఇలా చేయడం సరికాదని, కేటాయించిన టైమ్‌కు మాత్రమే రావాలని సూచించింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూలోనే భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.

News April 22, 2025

RRvsLSG: రాజస్థాన్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు

image

IPL: జైపూర్‌లో ఏప్రిల్ 19న LSGతో జరిగిన మ్యాచ్‌లో RR అనూహ్య ఓటమి ఫిక్సింగ్ ఆరోపణలకు దారితీసింది. RR మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిందంటూ రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్(RCA) అడ్‌హక్ కమిటీ కన్వీనర్ జైదీప్ బిహానీ ఆరోపించారు. హోం గ్రౌండ్‌లో గెలుపు ఖాయమనుకున్న దశలో ఎలా ఓడిపోయిందంటూ ప్రశ్నించారు. వెంటనే విచారణ చేపట్టాలన్నారు. RR యాజమాన్యం RCAను పక్కన పెట్టిందని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

News April 22, 2025

జనాభా పెంచేందుకు ట్రంప్ చర్యలు!

image

అమెరికాలో జననాల రేటు భారీగా తగ్గుతోంది. దీంతో పిల్లలను కనేలా ప్రజలను ప్రోత్సహించేందుకు ప్రెసిడెంట్ ట్రంప్ ఐడియాస్ సేకరిస్తున్నారట. వాటిలో తొలి బిడ్డను కంటే బేబీ బోనస్‌గా 5 వేల డాలర్లు, రెండో బిడ్డను కంటే ట్యాక్స్ క్రెడిట్స్ వంటివి ఉన్నట్లు సమాచారం. బర్త్ కంట్రోల్ అవసరం లేకుండానే అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా అవగాహన కల్పిస్తారని తెలుస్తోంది.

error: Content is protected !!