News June 24, 2024

పదేళ్ల ‘ప్రతిపక్షనేత’ నిరీక్షణకు తెర

image

2014 నుంచి లోక్‌సభలో ప్రతిపక్షనేత లేరు. ఎందుకంటే ఆ హోదా పొందాలంటే ఏదైనా ఒక పార్టీ కనీసం 55 మంది ఎంపీలను కలిగి ఉండాలి. గత రెండు పర్యాయాల్లో బీజేపీ మినహా ఏ పార్టీ ఆ మార్క్ చేరుకోలేదు. ప్రతిపక్ష కాంగ్రెస్ 2014లో 44, 2019లో 52 ఎంపీ సీట్లు గెలిచింది. అందుకే అధికారికంగా ప్రతిపక్ష నేతను నియమించలేకపోయింది. ఈసారి 99 ఎంపీ సీట్లు గెలిచి పదేళ్ల తర్వాత ప్రతిపక్ష నేతను నియమించేందుకు సిద్ధమైంది.

Similar News

News October 9, 2024

టాప్-10లోకి దూసుకొచ్చిన అర్ష్‌దీప్

image

ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తొలిసారి టాప్-10లోకి దూసుకొచ్చారు. భారత్ తరఫున అర్ష్‌దీప్ ఒక్కరే టాప్-10లో ఉన్నారు. ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో హార్దిక్ పాండ్య 3, అక్షర్ పటేల్ 11వ స్థానం దక్కించుకున్నారు. బ్యాటింగ్ విభాగంలో సూర్యకుమార్ యాదవ్ 2, యశస్వీ జైస్వాల్ 4, రుతురాజ్ గైక్వాడ్ 9వ స్థానంలో ఉన్నారు.

News October 9, 2024

ఈ జిల్లాలకు వర్ష సూచన: APSDMA

image

AP: రేపు అల్లూరి, ఎన్టీఆర్, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది.

News October 9, 2024

జెత్వానీకి ఎస్కార్టు ఎందుకు?: వెల్లంపల్లి

image

AP: దుర్గమ్మ దర్శనానికి వెళ్లిన విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మిని రోడ్డుపై నిలిపేసి, నటి కాదంబరి జెత్వానీని ఎస్కార్టుతో పంపడం దారుణమని వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రులు జరుగుతున్న తీరు చూస్తుంటే బాధేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘పవన్ రాకతో సాధారణ భక్తులను దర్శనానికి అనుమతించలేదు. ఉచిత బస్సుల్లో వృద్ధులను ఎక్కించుకోవటం లేదు’ అని ఆయన ఫైర్ అయ్యారు.