News September 25, 2024
మేకిన్ ఇండియాకు పదేళ్లు: తెచ్చిన మార్పుపై పీయూష్ గోయల్ ట్వీట్

‘మేకిన్ ఇండియా’ ఇనిషియేటివ్ తర్వాత మొబైళ్ల దిగుమతి 85% తగ్గిందని కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ అన్నారు. 2014-15లో రూ.48,609 కోట్లుగా ఉన్న దిగుమతుల విలువ 2023-24లో రూ.7665 కోట్లకు తగ్గిందన్నారు. 99% మొబైళ్లు భారత్లోనే ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ 2022- 2024 మధ్య 200% పెరిగాయన్నారు. మేకిన్ ఇండియాతో 6.78 లక్షల జాబ్స్ క్రియేటయ్యాయని, FDIలకు బూస్ట్ వచ్చిందన్నారు.
Similar News
News February 27, 2026
3.45 లక్షల మంది బాలికలకు ఉచితంగా HPV టీకా: సత్యకుమార్

AP: సర్వైకల్ క్యాన్సర్ నివారణకు 14 ఏళ్లు కలిగిన 3.45 లక్షల మంది బాలికలకు ఉచితంగా HPV వ్యాక్సిన్ ఇవ్వనున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. VZM జిల్లా చీపురుపల్లిలో శనివారం CM చంద్రబాబు దీన్ని ప్రారంభిస్తారన్నారు. ‘తొలివిడతగా కేంద్రం నుంచి 1,90,800 డోసులు వచ్చాయి. మిగతా వ్యాక్సిన్ ఇంకా అందుతుంది. కోల్డ్ స్టోరేజీ ఉన్న 1,645 ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో మాత్రమే వ్యాక్సిన్ ఇస్తారు’ అని చెప్పారు.
News February 27, 2026
విజయ్ భార్య విడాకుల పిటిషన్.. రాజకీయ కుట్ర?

హీరో విజయ్ భార్య సంగీత విడాకులు కోరడం వెనుక రాజకీయ కుట్ర ఉందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఓ నటితో ఆయనకు సంబంధం ఉన్నట్లు 2021లోనే గుర్తించానన్న ఆమె.. ఇప్పుడు కోర్టుకెక్కడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో ఏప్రిల్ 20న విజయ్ కోర్టుకు హాజరుకావాల్సి ఉందని, అప్పుడు ఎన్నికల ప్రచారంలో ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నారు. ప్రత్యర్థులు దీన్ని ఆయుధంగా చేసుకునే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
News February 27, 2026
అమెరికాపై తగ్గిన ఆసక్తి.. అందుకేనా?

USపై భారతీయ విద్యార్థుల ఆసక్తి తగ్గుతోంది. 2025లో అక్కడి వర్సిటీలకు అప్లై చేసిన విద్యార్థుల సంఖ్య 45% తగ్గినట్లు గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ కౌన్సిల్ వెల్లడించింది. వీసా, ఉద్యోగ అవకాశాల్లో సవాళ్లు, రాజకీయ పరిస్థితులు, ఆర్థిక భారం ఇందుకు కారణాలు. ఐరోపా (యూకే మినహా), ఆసియా దేశాలను ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు. కాగా భారత్లోని బిజినెస్ స్కూల్స్లో విదేశీ విద్యార్థుల అడ్మిషన్స్ 25% పెరిగాయి.


