News October 25, 2024

అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలకు జనవరిలో టెండర్లు

image

AP: అమరావతిలో నిర్మాణ పనులకు నవంబర్, డిసెంబర్‌లో టెండర్లు పిలుస్తామని మంత్రి నారాయణ తెలిపారు. రోడ్లు, లేఅవుట్లు, కొండవీటి, పాలవాగు, కెనాల్స్, కరకట్ట రోడ్లకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. సచివాలయ భవనాల నిర్మాణాలకు డిసెంబర్‌లో, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలకు వచ్చే ఏడాది JAN నెలాఖరులో టెండర్లు ఖరారు చేస్తామన్నారు. అమరావతి రైల్వే లైన్‌కు కేంద్రం ఆమోదం తెలపడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News February 2, 2026

రూ.20,000 తగ్గిన సిల్వర్ రేటు

image

వెండి ధరలు మరోసారి కుప్పకూలాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ ఒక్కరోజే కేజీ వెండి ధర రూ.20 వేలు తగ్గింది. దీంతో కేజీ సిల్వర్ రేటు ప్రస్తుతం రూ.3,00,000 పలుకుతోంది. కాగా 4 రోజుల్లోనే వెండి ధర రూ.1.25 లక్షలు తగ్గడం గమనార్హం.

News February 2, 2026

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

image

నిన్న భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 332 పాయింట్ల లాభంతో 81055కు చేరగా నిఫ్టీ 62 పాయింట్ల లాభంతో 24,886 వద్ద ట్రేడవుతోంది. L&T, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, ఎటర్నల్, పవర్ గ్రిడ్, రిలయన్స్ స్టాక్స్ లాభాల్లో ట్రేడవుతున్నాయి.

News February 2, 2026

భారీగా తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రా. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.9,050 తగ్గి రూ.1,51,530కు చేరింది. 10 గ్రా. 22 క్యారెట్ల పసిడి రూ.8,300 తగ్గి రూ.1,38,900 పలుకుతోంది.