News April 3, 2025
త్వరలో ‘బుడమేరు’ మరమ్మతులకు టెండర్లు: నిమ్మల

AP: గతేడాది విజయవాడను ముంచెత్తిన ‘బుడమేరు’ మరమ్మతులకు త్వరలో టెండర్లు పిలవాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. బుడమేరు డైవర్షన్ కెనాల్ పెండింగ్ పనుల పూర్తికి ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. వెలగలేరు రెగ్యులేటర్ నుంచి కొల్లేరు వరకు ఓల్డ్ ఛానెల్ సామర్థ్యం పెంపు, దానికి సమాంతరంగా కొత్త ఛానెల్ అభివృద్ధిపై ఫోకస్ చేయాలన్నారు. వరదల నియంత్రణకు కేంద్ర సాయంతో ముందుకెళ్లాలని పేర్కొన్నారు.
Similar News
News April 4, 2025
ట్రంప్ కామెంట్స్.. భారీగా పడిపోయిన ఫార్మా షేర్లు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల దెబ్బకు భారతీయ ఫార్మా షేర్లు భారీగా పడిపోతున్నాయి. త్వరలోనే ఫార్మా రంగంపై సుంకాలు మునుపెన్నడూ లేని విధంగా ఉంటాయని మీడియాతో ట్రంప్ వ్యాఖ్యానించారు. ఫార్మాను ప్రత్యేక కేటగిరీగా చూస్తున్నామని, త్వరలో టారిఫ్స్ విధిస్తామని స్పష్టం చేశారు. దీంతో అరబిందో ఫార్మా, IPCA లేబరేటరీస్, లుపిన్, ఇతర డ్రగ్ మేకర్స్ షేర్లు 10 శాతం వరకు పడిపోయాయి.
News April 4, 2025
వక్ఫ్ బిల్లుకు జేడీయూ మద్దతు.. నలుగురు రాజీనామా

వక్ఫ్ బిల్లుకు జేడీయూ మద్దతు తెలిపినందుకు నిరసనగా నలుగురు నేతలు ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న ఈ బిల్లుకు జేడీయూ అనుకూలంగా ఓటేయడంతో తాము మనస్తాపానికి గురయ్యామని ఆ పార్టీ అధినేత నితీశ్ కుమార్కు లేఖ రాశారు. రాజీనామా చేసిన వారిలో తబ్రేజ్ సిద్ధిఖీ, మహమ్మద్ షానవాజ్, మహమ్మద్ ఖాసిమ్ అన్సారీ, రాజు నయ్యర్ ఉన్నారు.
News April 4, 2025
ధనవంతులు అయ్యేందుకు టిప్స్!

కొన్ని పద్ధతులు పాటిస్తే ధనవంతులు కావొచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఒకే ఆదాయంతో మీరు ధనవంతులు కాలేరు. కచ్చితంగా రెండో ఆదాయం ఉండాల్సిందే. మీకు వచ్చిన ఆదాయంలో పొదుపు చేయగా మిగిలిన డబ్బును మాత్రమే ఖర్చు చేయాలి. ఏదో ఒక రంగంలో పెట్టుబడులు పెడుతూ ఉండాలి. ప్రతీ రూపాయికీ లెక్క ఉండాలి. ఎక్కువ డబ్బు సంపాదిస్తే ఎక్కువ పొదుపు చేయాలి. ఆ తర్వాత డబ్బే డబ్బును సంపాదిస్తుంది.