News July 11, 2024

అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ కోసం టెండర్లు

image

AP: రాజధాని అమరావతిలో ముళ్ల కంపలు, పిచ్చి మొక్కల తొలగింపు (జంగిల్ క్లియరెన్స్) కోసం CRDA టెండర్లు పిలిచింది. ఇప్పటికే కొంతమేర తొలగించినా భారీగా పెరిగిన కంపలను క్లియర్ చేసేందుకు యంత్ర సామగ్రి అవసరం కావడంతో రూ.36.50 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచింది. అర్హతలు, అతి తక్కువగా కోట్ చేసిన సంస్థకు పనులు అప్పగిస్తారు. ఈ జంగిల్ క్లియరెన్స్ కోసం 30 రోజులు సమయం పట్టే అవకాశం ఉంది.

Similar News

News January 23, 2026

పారదర్శకమైన ఓటర్ల జాబితానే లక్ష్యం: DRO

image

చిత్తూరు కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో DRO మోహన్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఎన్నికలకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు. ఇప్పటి వరకు జిల్లాలో 15,76,984 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహిస్తామన్నారు. ఈ ప్రక్రియ ద్వారా బోగస్, మరణించిన వారిని జాబితా నుంచి తొలగించి పారదర్శకమైన ఓటరు జాబితా రూపొందించ వచ్చని ఆయన పేర్కొన్నారు.

News January 23, 2026

కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు: బండి సంజయ్

image

TG: కేసీఆర్ కుటుంబం ఫోన్ ట్యాపింగ్‌తో పాటు ఎన్నో అక్రమాలకు పాల్పడిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అయినా ఆ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని, అసమర్థ ప్రభుత్వమని మండిపడ్డారు. ఢిల్లీకి ముడుపుల కోసమే ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో సాగదీస్తున్నారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనడానికి అన్ని ఆధారాలున్నా KCR కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు.

News January 23, 2026

కల్తీనెయ్యి.. ఛార్జిషీట్లో కీలక అంశాలు..

image

తిరుమలకు 2019-24లో కల్తీనెయ్యి సరఫరా అయినా TTD అడ్డుకోలేదని నెల్లూరు కోర్టులో ఇవాళ దాఖలు చేసిన ఫైనల్ ఛార్జిషీట్లో CBI పేర్కొంది. కర్ణాటక ప్రభుత్వానికి చెందిన నందిని డెయిరీ అంతకుముందు నెయ్యి సరఫరా చేయగా.. తగిన సామర్థ్యం, అనుభవం లేని AR డెయిరీకి టెండర్ దక్కేలా నిబంధనలు మార్చారని ఆరోపించింది. అటు ARకు ఇచ్చినా తెరవెనక భోలేబాబా సబ్ కాంట్రాక్ట్ పొంది నెయ్యి సప్లై చేసిందని దర్యాప్తు సంస్థ తెలిపింది.