News June 26, 2024
విజయవాడ-HYD ఆరు లైన్ల రోడ్‌కు త్వరలో టెండర్లు: మంత్రి కోమటిరెడ్డి

TG: బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో రహదారుల సమస్యలను పట్టించుకోలేదని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడ-హైదరాబాద్ ఆరు లైన్ల రోడ్‌కు త్వరలోనే టెండర్లు పిలిచి, రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారు. ఇతర కారిడార్లపైనా దృష్టి పెట్టనున్నట్లు పేర్కొన్నారు. తమ విన్నపాలకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.
Similar News
News January 5, 2026
ప్రాణాలు కాపాడుకొని.. సవాల్ విసరాలని!

మార్చి 31 నాటికి మావోయిజాన్ని అంతం చేస్తామన్న కేంద్రం ఆపరేషన్ కగార్ చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో ఎంతోమంది కీలక నేతలు మరణించగా అనేక మంది లొంగిపోయారు. ప్రస్తుతం దళంలో కొంతమందే మిగిలారు. అయితే డెడ్‌లైన్ నాటికి ప్రాణాలు కాపాడుకొని తమను నిర్మూలించలేరంటూ కేంద్రానికి సవాల్ విసరాలని వారు భావిస్తున్నట్లు సమాచారం. తిప్పిరి తిరుపతి సారథ్యంలోని దళాలు బలగాల కంటికి చిక్కకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాయి.
News January 5, 2026
నల్లమలసాగర్ ప్రాజెక్టు, ఫోన్ ట్యాపింగ్ కేసుపై నేడు సుప్రీంలో విచారణ

TG: ఏపీ ప్రతిపాదించిన పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు పనులను నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈరోజు విచారించనుంది. అనుమతుల్లేకుండా చేపడుతున్న ఈ పనులపై బలమైన వాదనలు వినిపించాలని న్యాయవాది అభిషేక్ సింఘ్వీకి సీఎం రేవంత్ సూచించారు. అటు ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావును విచారించేందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పైనా నేడు విచారణ జరగనుంది.
News January 5, 2026
ESIC నవీ ముంబైలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<


