News July 13, 2024
జాతీయ రహదారి విస్తరణకు త్వరలో టెండర్లు

AP: హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి విస్తరణ ప్రాజెక్టు డీపీఆర్ రూపకల్పన బాధ్యతను ప్రైవేటు సంస్థకు ఇవ్వాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. వచ్చే నెల చివరిలోగా టెండర్లు ఆహ్వానించాలని భావిస్తోంది. 181.5 కి.మీ మేర ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉన్న ఈ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించనున్నారు. నిర్మాణ వ్యయం రూ.600 కోట్ల నుంచి రూ.700 కోట్లు అవుతుందని ప్రాథమిక అంచనా.
Similar News
News December 26, 2025
అదానీ దూకుడు.. మూడేళ్లలో 33 కంపెనీలు!

గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ మూడేళ్లలో 33 కంపెనీలను తన ఖాతాలో వేసుకుంది. 2023 జనవరి నుంచి ఇప్పటిదాకా ₹80 వేల కోట్లతో వాటిని దక్కించుకుంది. హిండెన్బర్గ్ <<9860361>>ఆరోపణల<<>> తర్వాత ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచేందుకు ఈ కొనుగోళ్లు చేపట్టింది. ఇందులో అంబుజా, ACC, పెన్నా సిమెంట్, కరైకల్ పోర్టు, విదర్భ ఇండస్ట్రీస్ తదితర సంస్థలు ఉన్నాయి. రాబోయే ఐదేళ్లలో పలు రంగాల్లో ₹10 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.
News December 26, 2025
మామిడిలో బోరాన్, పొటాష్ లోపాన్ని ఎలా గుర్తించాలి?

మామిడిలో బోరాన్ లోపం వల్ల చెట్ల ఆకులు కురచగా మారి ఆకుకొనలు నొక్కుకుపోయి పెళుసుగా మారతాయి. కాయలపై పగుళ్లు ఏర్పడతాయి. దీని నివారణకు ప్రతి మొక్కకు 100గ్రా. బోరాక్స్ భూమిలో వేయాలి లేదా లీటరు నీటికి 1ml-2ml బోరాక్స్ లేదా బోరికామ్లం కొత్త చిగురు వచ్చినప్పుడు 1-2 సార్లు పిచికారీ చేయాలి. ఆకుల అంచులు ఎండిపోతే పొటాష్ లోపంగా గుర్తించాలి. దీని నివారణకు లీటరు నీటికి 13:0:45 10గ్రా. కలిపి పిచికారీ చేయాలి.
News December 26, 2025
కోల్ ఇండియా లిమిటెడ్లో 125 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

<


