News March 26, 2025

టెన్నిస్ స్టార్‌కు వేధింపులు.. భద్రత పెంపు

image

మియామి ఓపెన్‌లో పాల్గొంటున్న టెన్నిస్ స్టార్ ఇగా స్వైటెక్‌‌ను ఓ ప్రేక్షకుడు వేధించాడు. ఆమె ప్రాక్టీస్ చేస్తుండగా అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో ఇగాకు అక్కడి అధికారులు భద్రతను పెంచారు. క్రీడాకారిణిలపై బెదిరింపులను సహించేది లేదని పేర్కొన్నారు. నిందితుడిపై కఠిన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. గతనెల దుబాయ్ ఓపెన్ సందర్భంగా బ్రిటిష్ ప్లేయర్ ఎమ్మా రాడుకానుకు కూడా వేధింపులు ఎదురయ్యాయి.

Similar News

News December 16, 2025

గాంధీజీ పేరును తొలగించడం దురదృష్టకరం: శశిథరూర్

image

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో కేంద్రం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోతోంది. దీన్ని ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవక మిషన్ (గ్రామీణ్)’ (VBGRAMG) అని పేర్కొంది. అయితే దీనిపై కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గాంధీజీ పేరును తొలగించడం దురదృష్టకరమని, మహాత్ముడిని అగౌరవపరచొద్దని కాంగ్రెస్ MP శశి థరూర్ కోరారు.

News December 16, 2025

డిసెంబర్ 16: చరిత్రలో ఈరోజు

image

* 1912: సినీ దర్శకుడు, నిర్మాత ఆదుర్తి సుబ్బారావు జననం
* 1949: ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి జననం
* 1951: సాలార్ జంగ్ మ్యూజియం ప్రారంభం
* 1971: ప్రత్యేక బంగ్లాదేశ్ ఏర్పాటు
* విజయ్ దివస్ (1971 యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ విజయం)

News December 16, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.