News December 11, 2024

మోహన్ బాబు ఇంటి వద్ద మళ్లీ టెన్షన్

image

హైదరాబాద్ శంషాబాద్ జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రైవేట్ వ్యక్తులు బయటకు వెళ్లిపోవాలని మనోజ్ వార్నింగ్ ఇచ్చారు. వెంటనే విష్ణు జోక్యం చేసుకుని ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు ఎవరూ లేరని బదులిచ్చారు. మనోజ్‌కు సంబంధించిన ప్రైవేట్ వ్యక్తులు కూడా బయటకు వెళ్లాలని విష్ణు వార్నింగ్ ఇవ్వడంతో మళ్లీ అక్కడ ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.

Similar News

News February 8, 2026

KNR: మహాశివరాత్రి స్పెషల్.. 600 ప్రత్యేక బస్సులు!

image

మహాశివరాత్రి పండుగ రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులు ఏర్పాట్లు చేశామని ఆర్టీసీ KNR RM బి.రాజు తెలిపారు. ఈ నెల 14వ తేదీ నుండి 16 తేదీ వరకు 600 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. వేములవాడకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వేములవాడ బస్ స్టేషన్, కట్ట కింద ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్ స్టేషన్ లో అన్ని అవసరమైన వసతులు కల్పించామని తెలిపారు. భక్తులందరూ ఈ ప్రత్యేక బస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News February 8, 2026

బిల్లుల స్వీపింగ్: GHMCలో దోపిడీ!

image

నగర రోడ్లు క్లీన్ అవుతున్నాయో లేదో గానీ బడాబాబుల జేబులు ఫుల్ అవుతున్నాయి!. మెకానికల్ స్వీపింగ్ మెషీన్ల పేరుతో నెలకు రూ.కోట్ల ప్రజాధనం పక్కదారి పడుతోంది. అసలు 30 మెషీన్లు షెడ్డు దాటకుండానే GPS డేటాను ట్యాంపర్ చేసి బిల్లులు దండుకుంటున్నారు. ఇది GHMC ఇంటర్నల్ విచారణలో తేలినట్లు టాక్. నెలకు రూ. 12 కోట్ల బడ్జెట్‌లో సింహభాగం కాంట్రాక్టర్లు, అధికారుల పాలవుతున్నట్లు GHMC బాస్ దృష్టికి వచ్చినట్లు సమాచారం.

News February 8, 2026

TODAY HEADLINES

image

⋆ AP: అమరావతిలో క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన
⋆ క్వాంటం వ్యాలీ దేశానికే గేమ్ ఛేంజర్: CM చంద్రబాబు
⋆ ఏపీలో పంచాయతీ ఎన్నికలకు SEC సన్నాహాలు
⋆ TG: కేసీఆర్ మనోడు కాదు పరాయి వాడు: CM రేవంత్
⋆ KCRపై చర్యలు తీసుకునే దమ్ము రేవంత్‌కు లేదా: కిషన్ రెడ్డి
⋆ రేవంత్ ఎప్పటికీ కాంగ్రెస్ మనిషి కాలేరు: KTR
⋆ పెరిగిన బంగారం, వెండి ధరలు
⋆ టీ20 WC: USAపై భారత్ విజయం