News June 27, 2024

మాచర్లలో ఉద్రిక్తత?

image

AP: పల్నాడు జిల్లా మాచర్లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. YCP మాజీ MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ క్రమంలో పిన్నెల్లి అనుచరులు, అభిమానులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మరోవైపు పిన్నెల్లి వ్యతిరేక వర్గం బాణసంచా కాల్చింది. దీంతో ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. కాగా EVM ధ్వంసం, CIపై దాడి కేసులో పిన్నెల్లిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Similar News

News December 8, 2025

చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని మృతి

image

TG: సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట(M) గొల్లపల్లిలో విషాదం చోటు చేసుకుంది. సురేందర్ అనే వ్యక్తి నిన్న ఇంట్లో చికెన్ తింటుండగా ఓ ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. ఊపిరి ఆడకపోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటన గ్రామంలో విషాదం నింపింది. ఇటీవల ఉమ్మడి MBNR జిల్లాలో గొంతులో గుడ్డు ఇరుక్కుని ఓ వ్యక్తి చనిపోయిన విషయం తెలిసిందే.

News December 8, 2025

RITESలో 400 పోస్టులు.. అప్లై చేశారా?

image

RITES 400 కాంట్రాక్ట్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు కోరుతోంది. ఉద్యోగాన్ని బట్టి బీఈ, బీటెక్, బీఫార్మసీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు DEC 25వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ. 42,478 చెల్లిస్తారు. జనవరి 11న రాత పరీక్ష నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://rites.com *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News December 8, 2025

భారీ జీతంతో AMPRIలో 20 పోస్టులు.. అప్లై చేశారా?

image

CSIR-అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెసెస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(AMPRI)లో 20సైంటిస్ట్, Sr సైంటిస్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ME, M.TECH, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఎంపికైన సైంటిస్ట్‌కు నెలకు రూ.1,26,900, Sr సైంటిస్ట్‌కు రూ.1,46,770 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://ampri.res.in/