News December 5, 2024
కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత
TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నిన్న ఆయన బంజారాహిల్స్ పీఎస్‌లో హల్చల్ చేశారు. తన ఫిర్యాదును తీసుకోవాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కౌశిక్‌పై పీఎస్‌లో కేసు నమోదైంది. ఈక్రమంలోనే ఉదయమే ఆయన ఇంటికి పోలీసులు వెళ్లారు. కౌశిక్‌ను అరెస్ట్ చేస్తారని ప్రచారం జరగడంతో బీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నాయి.
Similar News
News February 5, 2025
మోరిలో సత్రానికి 116 ఏళ్లు..!
సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంలోని వీరభద్రయ్య అన్నదాన సత్రానికి 116 ఏళ్లు పూర్తయ్యాయి. ఏటా అంతర్వేది తీర్థానికి వచ్చే యాత్రికులకు అష్టమి, నవమి, దశమి తిథుల్లో మోరి వద్ద జాన శంకరయ్య కుటుంబ సభ్యులు అన్నదానం చేశారు. తీర్థం రోజున అంతర్వేదిలోనూ భోజనాలు అందిస్తున్నారు. పూర్వం నడిచి వెళ్లే భక్తులకు ఈ సత్రమే ఆశ్రయం ఇచ్చేదని గ్రామస్థులు చెబుతున్నారు.
News February 5, 2025
ఉద్యోగుల ఆరోగ్య బీమాపై ప్రభుత్వం గుడ్ న్యూస్
AP: ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకం అమలుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ DME గుర్తించిన ఆస్పత్రుల్లో చికిత్స పొందేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రిఫరల్ ఆస్పత్రులను గుర్తించాలని NTR వైద్యసేవ CEOను ఆదేశించింది. ఇప్పటి వరకు TGలో 11 ఆస్పత్రుల్లోనే NTR వైద్యసేవ ట్రస్టు సేవలు అందుతున్నాయి. దీంతో 2015 తర్వాత ట్రస్టు గుర్తింపులేని ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందేందుకు ఎలాంటి అడ్డంకులు ఉండవు.
News February 5, 2025
IBPS పీవో స్కోర్ కార్డులు విడుదల
IBPS పీవో మెయిన్స్ స్కోర్ కార్డులు వచ్చేశాయి. గతేడాది NOVలో ఎగ్జామ్ రాసిన అభ్యర్థుల ఫలితాలను జనవరి 31న రిలీజ్ చేయగా, తాజాగా స్కోర్ కార్డులను అందుబాటులో ఉంచారు. <