News September 12, 2024

YCP MP మిథున్ రెడ్డి బర్త్ డే వేడుకల్లో ఉద్రిక్తత

image

AP: రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో ఉద్రిక్తత నెలకొంది. చిత్తూరు జిల్లా సదుం మండలం పెద్దూరులో జరిగిన ఎంపీ బర్త్ డే వేడుకల సందర్భంగా వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో ఇరువర్గాలు పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నాయి. ఈ గొడవలో పలువురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Similar News

News August 25, 2025

అదనంగా సర్వీస్ ఛార్జీ ఎందుకు చెల్లించాలి: HC

image

హోటళ్లు, రెస్టారెంట్లలో వసూలు చేస్తున్న సర్వీస్‌ ఛార్జీలపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.20 వాటర్ బాటిల్‌కు రూ.100 తీసుకుంటున్నప్పుడు మళ్లీ విడిగా సర్వీస్ ఛార్జీ ఎందుకు చెల్లించాలని ప్రశ్నించింది. ఛార్జీ తప్పనిసరి కాదంటూ గతంలో హైకోర్టు ఏకసభ్య ధర్మానసం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ భారత హోటళ్లు, రెస్టారెంట్ల సంఘాలు పిటిషన్ వేశాయి. తాజాగా ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

News August 25, 2025

సింధు సత్తా చాటేనా!

image

నేటి నుంచి BWF వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ మొదలు కానుంది. మెన్స్ సింగిల్స్‌లో భారత ప్లేయర్ లక్ష్యసేన్ టాప్ సీడ్ షియుక్వి(చైనా)తో తలపడనున్నారు. మహిళల విభాగంలో PV సింధు బల్గేరియాకు చెందిన కలోయాన‌తో పోటీ పడనున్నారు. ఈ టోర్నీలోనైనా సింధు ఫామ్ అందుకుంటారో చూడాలి. ఇక మెన్స్ డబుల్స్‌లో IND నుంచి సాయిరాజ్-చిరాగ్‌ జోడీ, ఉమెన్స్ డబుల్స్‌లో ప్రియా-శ్రుతి మిశ్రా, రుతుపర్ణ-శ్వేతపర్ణ బరిలో ఉన్నారు.

News August 25, 2025

840 కొత్త బార్లకు 30 అప్లికేషన్లే!

image

AP: నూతన <<17448943>>బార్<<>> విధానానికి స్పందన కరువైంది. మొత్తం 840 బార్లకు నిన్నటి వరకు 30 అప్లికేషన్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. లైసెన్స్ దరఖాస్తులకు రేపటితో గడువు ముగియనుంది. దీంతో ఎక్సైజ్ అధికారుల్లో ఆందోళన నెలకొంది. బార్లకు ఇచ్చే మద్యంపై పన్ను, ఒక్కో బార్‌కు నాలుగు దరఖాస్తులు తప్పనిసరంటూ నిబంధనలు వ్యాపారుల నుంచి వ్యతిరేకతకు కారణమని సమాచారం. అయితే నిబంధనల్లో మార్పులు ఉండబోవని అధికారులు చెబుతున్నారు.