News April 21, 2024
గుడివాడలో టెన్షన్ టెన్షన్

AP: కృష్ణా(D) గుడివాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నెల 22న నామినేషన్లు వేసేందుకు అనుమతి ఇవ్వాలని TDP, YCP అభ్యర్థులు పోలీసులను కోరారు. శాంతిభద్రతల పరిరక్షణ నేపథ్యంలో ఇద్దరూ ఒకేరోజు నామినేషన్ వేయడం కుదరదని తేల్చి చెప్పారు. ఇరు పార్టీలు మాత్రం తాము వెనక్కి తగ్గేది లేదని పట్టుబట్టడంతో రేపు ఏం జరుగుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. టీడీపీ తరఫున వెనిగండ్ల రాము, వైసీపీ నుంచి కొడాలి నాని బరిలో ఉన్నారు.
Similar News
News March 25, 2026
రాజమండ్రిలో పోలవరం ప్రాజెక్టు ఆఫీసు ప్రారంభం

AP: రాజమండ్రిలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ (PPA) ప్రధాన కార్యాలయం ఏర్పాటైంది. ఈ ఆఫీసును కేంద్ర జల శక్తి కార్యదర్శి వీఎల్ కాంతారావు ప్రారంభించారు. తర్వాత పోలవరం పనులను పరిశీలించి, అధికారులతో ఆయన సమీక్షించారు. కాగా ఇప్పటివరకు PPA ప్రధాన ఆఫీసు హైదరాబాద్‌లో ఉండేది.
News March 25, 2026
మిచెల్ స్టార్క్‌కు DC షాక్ ఇవ్వనుందా?

వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా IPL ఆరంభ మ్యాచులకు ఢిల్లీ స్టార్ బౌలర్ స్టార్క్ దూరం కానున్నారు. అయితే కొన్నిరోజుల్లో తన రాకపై అప్డేట్ ఇవ్వకపోతే జట్టు నుంచి తప్పించాలని యాజమాన్యం నిర్ణయించినట్లు క్రీడావర్గాలు తెలిపాయి. స్టార్క్ స్థానంలో మరొక ప్లేయర్‌ను తీసుకోవడానికి సిద్ధమైనట్లు చెప్పాయి. AUS క్రికెట్ బోర్డు NOC ఇవ్వకపోవడంతో స్టార్క్ ఎప్పుడు జట్టులో జాయిన్ అవుతారనే దానిపై క్లారిటీ లేదు.
News March 25, 2026
ఇందిరపై కామెంట్స్.. సభలో బీజేపీ Vs కాంగ్రెస్

TG: ఇందిరపై రాకేశ్ రెడ్డి <<19474706>>కామెంట్స్<<>> సభలో BJP-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఆమెపై అలాంటి వ్యాఖ్యలు హరీశ్ రావు సహా ఎవరు చేసినా సరికాదని మంత్రి శ్రీధర్ బాబు అనడంతో BRS MLA సంజయ్, BJP MLAలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రాకేశ్ రెడ్డి అడ్డుపడ్డారు. దీంతో వారిని కూర్చోండంటూ మంత్రి ఆగ్రహించారు. ఇక రాకేశ్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని, రికార్డుల నుంచి తొలగించాల్సిన అవసరం లేదని ఏలేటి అన్నారు.


