News February 7, 2026
TENTH: ఇంగ్లిష్ ఎగ్జామ్ తేదీ మార్పు

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు జరిగింది. ఇంగ్లిష్ పరీక్షను మార్చి 20న కాకుండా 21న (శనివారం) నిర్వహించనున్నట్లు ఎస్సెస్సీ బోర్డు అధికారికంగా ప్రకటించింది. 20న రంజాన్ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. మిగతా అన్ని పరీక్షలు ముందుగా ప్రకటించిన టైమ్ టేబుల్ ప్రకారమే యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేసింది. కాగా మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి.
Similar News
News February 14, 2026
AP వ్యవసాయ రంగం వృద్ధి రేటు 7.83 శాతం: అచ్చెన్న

భారత వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ వాటా 10 శాతంగా ఉందని, వ్యవసాయ రంగంలో AP 7.83% వృద్ధి రేటు సాధించిందని మంత్రి అచ్చెన్నాయుడు బడ్జెట్ సందర్భంగా వెల్లడించారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లు జరిపి రికార్డు స్థాయిలో 24 గంటల్లోనే రూ.9 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. అన్నదాత సుఖీభవ-PM కిసాన్ కింద 2025-26లో రూ.6,309 కోట్లు చెల్లించామని.. 2026-27లో దానిని రూ.6,600 కోట్లకు పెంచామన్నారు.
News February 14, 2026
బంగినపల్లి మామిడి@ టన్ను రూ.1.75 లక్షలు

AP: మామిడి పండ్లకు రికార్డు స్థాయి ధరలు పలుకుతున్నాయి. తోతాపురి టన్ను ధర ₹1.10 లక్షలకు చేరగా, బంగినపల్లి మామిడి(కవర్లు కట్టి సాగు చేసినవి)కి ₹1.75 లక్షల రేటు పలికింది. దీంతో ఎన్టీఆర్ జిల్లాలోని రైతులకు కాసుల వర్షం కురుస్తోంది. గతంతో పోలిస్తే ఈ రేటు ₹50వేలు ఎక్కువ కావడం విశేషం. కాయల నాణ్యత తగ్గకుండా ఉండేందుకు వాటికి కవర్లను(ఒక్కో కవర్ ₹2) కడుతుంటారు. వీటికి ప్రభుత్వం 50% సబ్సిడీ కూడా ఇస్తుంది.
News February 14, 2026
ఒడిశాలో సరికొత్త విప్లవం.. సూపర్ ఫుడ్స్ సాగుతో!

సంప్రదాయ పంటలకే కాకుండా భవిష్యత్తు సూపర్ ఫుడ్స్‌కు నిలయంగా ఒడిశా మారుతోంది. ఖుర్దా జిల్లా బెగునియా ప్రాంతంలో ఒక రైతు 40 లక్షల లీటర్ల సామర్థ్యం గల అతిపెద్ద ‘స్పిరులినా’ ఫామ్‌ను ఏర్పాటు చేశారు. నీలి ఆకుపచ్చ నాచు రకానికి చెందిన ఈ సూపర్ ఫుడ్‌లో ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న ఈ పోషకాహార సాగులో ఒడిశా ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తోంది.


