News April 24, 2024
మే 24 నుంచి టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు

AP: టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు మే 24 నుంచి జూన్ 3 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ కమిషనర్ సురేశ్ వెల్లడించారు. రేపటి నుంచి ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లికేషన్లు స్వీకరిస్తామని, విద్యార్థులు స్కూల్ నుంచి మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. నాలుగు రోజుల్లో షార్ట్ మెమోలు విడుదల చేస్తామన్నారు.
Similar News
News March 26, 2026
ధురంధర్-2పై ఏఐ వీడియోలు.. డైరెక్టర్ వార్నింగ్

ధురంధర్-2 సినిమాకు ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణకు డైరెక్టర్ ఆదిత్య ధర్ ధన్యవాదాలు తెలిపారు. అయితే కొందరు చిత్రంలోని సన్నివేశాలను AIతో మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘హమ్జా పాత్ర తలపాగా ధరించి ధూమపానం చేస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఇది అవాస్తవం. రెచ్చగొట్టడానికి, గందరగోళం సృష్టించడానికి ఇలా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని SMలో హెచ్చరించారు.
News March 26, 2026
నేటి నుంచి భానుడి భగభగలు

TG: నేటి నుంచి భానుడు భగ్గుమంటాడని వాతావరణ నిపుణులు తెలిపారు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో 39-41 డిగ్రీలు, హైదరాబాద్‌లో 38-39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు. అధిక ఉష్ణోగ్రతలతో వికారాబాద్, సంగారెడ్డి, RR, నారాయణపేట్, ADB, ఆసిఫాబాద్ జిల్లాల్లో సాయంత్రం, రాత్రి వేళల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వివరించారు.
News March 26, 2026
పొట్టేళ్లకు ఎండు మేత చాలా ముఖ్యం

పొట్టేళ్ల పెంపకంలో పచ్చి మేత కంటే ఎండు మేతే చాలా ముఖ్యమని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. వేరుశనగ పొట్టు, ఉలవ పొట్టు, కంది పొట్టు వంటి చాలా రకాల ఎండు మేతలు అందుబాటులో ఉన్నాయి. వీటిని పొట్టేళ్లు చాలా ఇష్టంగా తింటాయి. దీని వల్ల అవి చాలా ఆరోగ్యంగా ఉంటూ, ఎక్కువ బరువు పెరుగుతాయి. అందుకే పచ్చిమేత కాస్త తక్కువైనా, ఎండు మేతను వెటర్నరీ నిపుణుల సూచనలతో సరైన పరిమాణంలో అందేలా చూసుకోవాలి.


